Devatha: దేవుడమ్మకు బాధలు చెప్పుకున్న దేవి.. రుక్మిణితో మాధవ వికృత చేష్టలు!

Published : May 24, 2022, 02:04 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Devatha: దేవుడమ్మకు బాధలు చెప్పుకున్న దేవి.. రుక్మిణితో మాధవ వికృత చేష్టలు!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే భాషా (Bhasha) దేవి ను అనేక రకాలుగా నవ్వించబోయే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవి (Devi) అలాగే దీనం గా ఉంటుంది. ఈలోపు ఆదిత్య రాగ దేవి తనను చూసి ఎంతో ఆనంద పడుతుంది. ఇక ఆదిత్య వచ్చిన ఆనందంలో దేవి దేవుడమ్మను ఆటలు ఆడదామని రెచ్చగొడుతుంది.
 

26

ఇక ఆనందంగా ఫ్యామిలీ మొత్తం కబడ్డీ ఆడతారు. ఆ తర్వాత దేవి (Devi) నన్ను ఇంటి దగ్గర విడిచి పెట్టండి అని అడుగుతుంది. మరోవైపు రుక్మిణి (Rukmini) దేవికి మాయ మాటలు చెప్పినందుకు మాధవ పై విరుచుకు పడుతుంది. అంతే కాకుండా ఈ ఇంట్లో నేను ఉండను నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది.
 

36

ఇక మాధవ (Madhava) వెళ్ళేది నువ్వు ఒక్కదానివే, నీతో పాటు ఎవరూ రారు అన్నట్లు చెబుతాడు. దేవి ఇల్లు దాటి రాదు అని చెబుతాడు. ఇక నువ్వు నాలోని రాధనే చూస్తున్నావు.. రుక్మిణిని (Rukmini) చూడలేదు. నన్ను రుక్మిణిగా మారనియ్యకు అని రుక్మిణి కళ్ళు పెద్దగా చేసి మాధవ కు వార్నింగ్ ఇస్తుంది.
 

46

ఇక దేవి (Devi) దేవుడమ్మలు ఒక దగ్గర కలిసి కూర్చుంటారు. ఆ క్రమంలో దేవి మా అమ్మ లేదు సచ్చిపోయింది అని చెబుతోంది. దాంతో దేవుడమ్మ (Devudamma) ఆశ్చర్యపోతుంది. రాధమ్మ ను మా అమ్మ అని అబద్ధం చెప్పారు అంటూ తన మనసులో ఉన్న మాటలన్నీ బయట పెడుతుంది. మరోవైపు ఆదిత్య దేవి నా బిడ్డ అని రాధ చెప్పిన మాట నిజమా అబద్దమా అని ఆలోచిస్తాడు.
 

56

ఆ తర్వాత దేవుడమ్మ (Devudamma) దేవి ను వాళ్ళ ఇంట్లో దింపడానికి వెళుతుంది. దేవుడమ్మ ను గమనించిన రాధ (Radha) గదిలోకి వెళ్తుంది. ఇక దేవుడమ్మ రాధ తో మాట్లాడతాను పిలుచుకు రా అని దేవితో చెబుతుంది. దేవి రాధ దగ్గరకు వచ్చి చెప్పగా..  ఎందుకు అని అడుగుతుంది.
 

66

తరువాయి భాగం లో ఇంకోసారి నా తల్లి ఎవరు అని నన్ను అడగను అని ఒట్టు వెయ్యి బిడ్డ.. అని రుక్మిణి (Rukmini) దేవి తో అంటుంది. నువ్వే నా తల్లి అయితే ఇంకోసారి అబద్ధం చెప్పనని ఒట్టు వెయ్యి అని దేవి (Devi) అడుగుతుంది. ఆ మాటతో రుక్మిణి కుమిలిపోతుంది. మరోవైపు దేవుడమ్మ దేవి చెప్పిన విషయం ఆదిత్య కు చెబుతుంది. దాంతో ఆదిత్య ఆశ్చర్యపోతాడు.

click me!

Recommended Stories