Devatha: తాగుబోతు గురించి నిజం బయటపెట్టిన ఆదిత్య.. షాక్ లో దేవి!

Published : Sep 01, 2022, 12:05 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
16
Devatha: తాగుబోతు గురించి నిజం బయటపెట్టిన ఆదిత్య.. షాక్ లో దేవి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఆ తాగుబోతు దేవితో, నిన్ను ఒకసారి చూస్తే చాలు అనుకున్నాను అమ్మ కానీ ఈ రోజంతా నీతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇలాగే నిన్ను మీ అమ్మని ప్రతిరోజు నాతోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను కానీ నా కోరికలు తీరనివి. నిన్ను ఇలాగే నా కళ్ళముందే ఉంచుకోవాలని ఉన్నది అని అంటాడు ఆ మాటలకు దేవి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సీన్ లో మాధవ్,అందరూ దేవి ఎక్కడున్నాది అని తెగ వెతికేసుకుంటున్నట్టున్నారు కానీ దేవి వాళ్ళకు కనపడదు.
 

26

 దేవి ఎక్కడికెళ్ళిందో నాకు మాత్రమే తెలుసు అని అంటాడు. ఇంతలో జానకమ్మ,దేవి కనిపించడం లేదంట అని చెప్తుంది దానికి మాధవ్ ఓహో అని అంటాడు. జానకమ్మ, కూతురు కనబడడం లేదంటే అలాగా కంగారు పడకుండా ఎలా ఉంటున్నావ్ రా అని అడగగా మొన్న కూడా అలాగే కనబడటం లేదు అని అన్నారు చివరికి తిరిగి ఇంటికి వచ్చేసింది కదా ఇప్పుడు కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది భయపడాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోతాడు. జానకమ్మ, వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది.
 

36

దేవుడమ్మ ఇంటికి గాని వెళ్ళిందా అని దేవుడమ్మకి ఫోన్ చేస్తుంది జానకమ్మ.అక్కడికి కూడా రాలేదు అని దేవుడమ్మ చెప్తుంది అలాగే దేవి తిరిగి ఇంటికి వస్తే మాకు ఒక మాట చెప్పండి భయంగా ఉన్నది అని దేవుడమ్మ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దేవి ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి అని దేవుడమ్మ సత్య దగ్గరికి వెళ్లి మాధవ్ కి పిల్లలు అంటే ఇష్టమేనా ఒకవేళ ఇష్టమే అయితే గాలికి వదిలేయడు కదా మరి దేవి ఇంటికి ఎందుకు రాలేదు అని అడగంగా దేవి కనిపించడం లేదా అని సత్య అడుగుతుంది.
 

46

 రాధ దేవిని బాగానే చూసుకుంటుందా అని దేవుడమ్మ సత్య ని అడగగా అక్క పిల్లల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది అక్క ని అనుమానించాల్సిన అవసరం లేదు అని సత్య అంటుంది. ఆ తర్వాత సీన్లో ఆ తాగుబోతు దేవితో నాతోనే ఉండిపోవచ్చు కదా అమ్మ అని అనగా అదే సమయంలో అక్కడికి రుక్మిణి ఆదిత్యలు వస్తారు  ఆదిత్య ఆ తాగుబోతుని కొడుతూ ఉంటాడు. రుక్మిణి దేవిని అడ్డుకుంటుంది. నిజం చెప్పురా ఎవరిని పంపించారు నువ్వు దేవి వాళ్ళ నాన్న కాదని దేవికి నిజం చెప్పు అని అంటాడు.కానీ వాడు నిజం చెప్పడు.
 

56

 అప్పుడు ఆదిత్య పక్కనున్న ఒక వస్తువుతో వాడిని కొట్టబోతాడు అప్పుడు వాడు, మాధవ్ సార్ వాళ్ళ నాన్న కాదని తెలిసి నేను వాళ్ళ నాన్నగా నటించి ఎంతో కొంత లాగేయొచ్చు అనుకున్నాను అని చెప్తాడు.మనసులో,మాధవ్ సార్ పేరు చెప్తే ఆయన నన్ను చంపేస్తారు అని అనుకుని అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడు దేవి చాలా ఆశ్చర్య పోతుంది.చూసావా దేవమ్మా నేను చెప్పాను కదా మీ నాయన కాదు అని నా మాట వినలేదు అని రుక్మిణి అనగా నా నాన్న ఎవరో తెలియదు కాబట్టే కదా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి నాయనా అని చెప్తున్నారు, నేను మోసపోతున్నాను.
 

66

 అసలు మా నాయన ఉన్నారా లేదా అని అడగగా ఆదిత్య మీ నాన్న ఎవరంటే అని చెప్పేలోగా దేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.ఆరోజు రాత్రి దేవుడమ్మ, సత్యం దేవి గురించి కంగారు పడుతుండగా ఆదిత్య ఇంటికి వస్తాడు. వచ్చి మీరు ఏం కంగారు పడొద్దు దేవి ఇంటికి క్షేమంగానే తిరిగి వెళ్ళింది, ఆ మాధవ్ గాడు అలా ఉండడం బట్టే దేవి ఇలా ఉంటుంది అని అంటాడు.అప్పుడు దేవుడమ్మ కూడా మాధవ్ నీ తిడుతుంది.తర్వాత సీన్ లో రుక్మిణి దేవిని పడుకోబెట్టి మనసులో ఏడుస్తూ ఉంటుంది. నావల్లే కదా నీకు ఈ కష్టాలన్నీ నేను మీ నాయన ఎవరో చెప్తే నువ్వు ఆనందంగానే ఉంటావు. కానీ అప్పుడు నుంచి ఇంకో పెద్ద సమస్య మొదలవుతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories