Guppedantha Manasu: రిషికి యాక్సిడెంట్ కు కారణం నువ్వే వసుధార.. మళ్లీ బుద్ది చూపించిన దేవయాని!

Published : Jun 06, 2022, 08:58 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: రిషికి యాక్సిడెంట్ కు కారణం నువ్వే వసుధార.. మళ్లీ బుద్ది చూపించిన దేవయాని!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సాక్షి (Sakshi) మీ ఇద్దరి పరువు తీస్తాను అని చెప్పి వసు (Vasu) కు రిషి వసులు కలిసి దిగిన ఫోటోలు చూపెడుతుంది. అంతేకాకుండా కాలేజ్ వద్ద ఈ ఫోటోలు అంటించి అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటుంది. ఇక నువ్వు రిషి కి దూరంగా ఉండడం లేదు నేను చెప్పిన పని నిజం చేస్తాను అని అంటుంది.

26

ఇక మీ ఇద్దరి మధ్య నేను ఎంతో డిస్టబెన్స్ క్రియేట్ చేయబోతున్నాను అని సాక్షి (Sakshi) వసుకు వార్నింగ్ ఇస్తుంది. దాంతో వసు (Vasu) నేను క్లారిటీ గా ఉన్నాను, నువ్వేం నాకు చెప్పనవసరం లేదు అని తనదైన స్టైల్లో తిరగబడుతుంది. అంతేకాకుండా ఇంకెప్పుడూ నా దారికి అడ్డు రాకు అని వసు సాక్షి కు చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
 

36

మరో వైపు మహేంద్ర (Mahendra) రిషి ను వసు పని చేసే రెస్టారెంట్ కు తీసుకువస్తాడు. అక్కడ వసు, జగతి లను కలుసుకుంటారు. ఇక ఈ లోపు అక్కడకు సాక్షి కూడా వస్తుంది. ఇక వసును చూసిన రిషి నన్ను కొంచెం కారు లో డ్రాప్ చేస్తావా? అని సాక్షిని అడుగుతాడు. దాంతో సాక్షి (Sakshi) రిషి ను డ్రాప్ చేయడానికి ఓకే చెబుతుంది.
 

46

ఇక సాక్షి (Sakshi) నువ్వు నా కారులో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెబుతుంది. రిషి (Rishi) కారు డ్రైవ్ చేస్తాను అని సాక్షి దగ్గర కీ తీసుకుంటాడు. ఈ క్రమంలో మహేంద్ర కాల్ చేసి నువ్వు చేసింది కరెక్ట్ ఏ నా? రిషి అని అడుగుతాడు. ఇక సాక్షి కారులో వెళ్తూ నీతో నేను వస్తునందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని రిషి తో చెబుతుంది.
 

56

సాక్షి (Sakshi) నీతో పాటు ప్రయాణం చేయడం నాకు ఇష్టమని చెబుతోంది. దాంతో రిషి (Rishi) నాకు ఇష్టం లేదు అంటూ కారు దిగి నడుచుకుంటూ వెళ్తాడు. ఇక రిషి ఎందుకు నాకు సాక్షి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించడంలేదని అనుకుంటాడు. నన్ను ఎందుకు ఇలా వేదిస్తున్నావ్ వసు? అని రిషి మనసులో ప్రశ్న వేసుకుంటూ ఉంటాడు.

66

ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) తల మీద దెబ్బతో సృహ తప్పి పోయి ఆటో లో ఇంటికి వస్తాడు. అది తెలుసుకున్న వసు (Vasu) కంగారు గా వస్తుంది. ఈ లోపు దేవయాని అడ్డుపడి నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని వసు తో అంటుంది. ఆ మాటతో వసు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది.

click me!

Recommended Stories