`దేవర` టైటిల్‌లోనే అసలు కథ ఉందా? ఎన్టీఆర్‌ లేటెస్ట్ పోస్టర్‌ వెనక ఉన్న మీనింగ్‌ పెద్దదే?

First Published | Feb 17, 2024, 4:09 PM IST

`దేవర` మూవీ టైటిల్‌లోనే సినిమా అసలు కథ దాగుంది. లేటెస్ట్ గా విడుదల చేసిన ఎన్టీఆర్‌ పోస్టర్‌లో ఏముంది? ఆ టైటిల్‌ ఏం చెబుతుందనేది చూస్తే..
 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర`తో బిజీగా ఉన్నాడు. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయన నుంచి వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మర్‌ కి రావాల్సిన ఈ మూవీ దసరాకి విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ వెల్లడించింది. ఇదిలా ఉంటే `దేవర` సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని టైటిల్‌ ద్వారానే వెల్లడించింది యూనిట్‌. 
 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. తారక్‌ తండ్రి కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరు టీమ్‌ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా టీమ్‌ విడుదల చేసిన పోస్టర్‌ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కొత్త పోస్టర్‌లో టైటిల్‌ ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేయడంతోపాటు సినిమాకి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టేలా ఉండటం విశేషం. 
 


`దేవర` టైటిల్‌లోనే అసలు కథ కనిపిస్తుంది. ప్రారంభంలో `దేవర` టైటిల్ ప్లెయిన్‌గా ఉంది. కానీ నిన్న కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో ఓ రహస్యాన్ని బయటపెట్టారు. టైటిల్‌లో `దేవర`లో `వర` రెడ్‌ కలర్‌తో ఉంది. అంతేకాదు ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ కూడా కొత్తగా ఉంది. ఇందులో యంగ్‌గా కనిపిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన లుక్‌లో ఎన్టీఆర్‌ పెద్దగా కనిపించాడు. ఇదే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెడుతుంది. 
 

ప్రారంభంలో వచ్చిన ఎన్టీఆర్‌ లుక్‌ తండ్రి పాత్రకి సంబంధించినది అని, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన లుక్‌ కొడుకు పాత్రకి సంబంధించినదిగా తెలుస్తుంది. తండ్రి దేవరగా కనిపిస్తే, కొడుకు వర పాత్రలో కనిపిస్తాడని అర్థమవుతుంది. సముద్రపు పోర్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో కథ సాగుతుందట. ఇందులో తండ్రి పాత్ర పోర్ట్ ని నిర్మిస్తుందని, దాన్ని ప్రత్యర్థుల నుంచి, అక్కడ అక్రమాలు జరగకుండా చూసే పాత్రలో దేవర పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఆయన్నుంచి లాక్కున్న తర్వాత విలన్ల నుంచి తమ పోర్ట్ ని తిరిగి దక్కించుకునే పాత్రలో వర పాత్ర ఉంటుందని తెలుస్తుంది. 
 

ఇందులో కొడుకు పాత్రకి జోడీగా తంగం పాత్రలో జాన్వీ కపూర్‌ కనిపిస్తుందని, తండ్రి పాత్రకి మరాఠి నటి శృతి మరాఠే కనిపిస్తుందని తెలుస్తుంది. సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌లో భయం అంటే తెలియని వాళ్లకి హీరో భయాన్ని పరిచయం చేయడమనే కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌ 10న దసరా కానుకగా విడుదల కానుంది. 
 

Latest Videos

click me!