Lavanya Tripathi: గుడ్‌ న్యూస్‌ చెప్పిన లావణ్య త్రిపాఠి.. పోస్ట్ తో సర్‌ప్రైజ్‌

Published : Jan 08, 2024, 08:41 PM IST

లావణ్య త్రిపాఠి ఇటీవలే పెళ్లి చేసుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ని మ్యారేజ్‌ చేసుకుంది. కానీ అనూహ్యంగా ఆమె గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అందరిని సర్‌ ప్రైజ్‌ చేసింది.   

PREV
16
Lavanya Tripathi: గుడ్‌ న్యూస్‌ చెప్పిన లావణ్య త్రిపాఠి.. పోస్ట్ తో సర్‌ప్రైజ్‌
Varun Tej

మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉంది. ఆమె పూర్తిగా ఫ్యామిలీకే టైమ్‌ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.  ఓ వైపు భర్త వరుణ్‌ తేజ్‌తో కలిసి విదేశాలను ఎంజాయ్‌ చేస్తుంది. మరోవైపు ఫ్యామిలీ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి పెట్టిన పోస్ట్ ఇప్పుడు షాక్‌కి గురి చేస్తుంది.
 

26

లావణ్య త్రిపాఠి ఇటీవల వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. రెండు నెలల క్రితమే వీరి మ్యారేజ్‌ జరిగింది. ఇంతలోనే లావణ్య త్రిపాఠి గుడ్‌ న్యూస్‌ చెప్పడంతో అంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే అందులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. లావణ్య త్రిపాఠి చెప్పిన గుడ్‌ న్యూస్‌ తనకు సంబంధించినది కాదు, తన ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్‌. 
 

36

ఇందులో తమ ఇంట్లోకి వారసుడు వచ్చినట్టు చెప్పింది. ఈ మేరకు చిన్నారి ఫోటోని పంచుకుంది. తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్టు వెల్లడించింది లావణ్య త్రిపాఠి. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తమ ఫ్యామిలీలోకి డింపుల్‌ స్ట్రాంగ్‌గా ఉన్నట్టు తెలిపింది. మా చిన్నారి అల్లుడు అని పేర్కొంది. డింపుల్‌ రావడాన్ని లావణ్య త్రిపాటి ప్రత్యేకంగా గుర్తించి చెప్పడం విశేషం. 
 

46

లావణ్యత్రిపాఠి ఫ్యామిలీలో చీక్స్ కి సొట్టలు ఉండటం కామన్. దీంతో తమ వారసులకు అదే వచ్చిందని తెలిపింది లావణ్య. అయితే దాన్ని చాలా గర్వంగా ప్రకటించుకోవడం విశేషం. ప్రస్తుతం చిన్నారి ఫోటో వైరల్‌ అవుతుంది. దీంతో దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. మరి మీరెప్పుడు గుడ్‌ న్యూస్‌ చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విశేషం కోసం వెయిట్‌ చేస్తున్నట్టు వెల్లడిస్తున్నారు. 

56

లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ని ప్రకటించింది. `మిస్‌ పర్‌ఫెక్ట్` అనే సిరీస్‌ని బిగ్‌ బాస్ 4 విన్నర్‌ అభిజిత్‌ తో కలిసి చేస్తుంది. ఇటీవలే ఫస్ట్ లుక్‌ని ప్రకటించారు. అయితే అది గతంలో చేసిందని తెలుస్తుంది. మరి కొత్తగా ఇప్పుడు సినిమాలను చేస్తుందా? అనేదిసస్పెన్స్. మెగా ఫ్యామిలీ ఒప్పుకుంటారా? లేక సినిమాలు మానేసి లావణ్య త్రిపాఠి ఇంటికే పరిమితం అవుతుందా అనేది చూడాలి. 
 

66

మరోవైపు వరుణ్‌ తేజ్‌.. ప్రస్తుతం `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. గతంలో వరుణ్‌ తేజ్‌ నటించిన సినిమాలు పరాజయం చెందాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు పెళ్లి తర్వాత విడుదల కాబోతున్న సినిమా హిట్‌ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories