`దేవర` సినిమా స్టోరీ ఇదే, చిన్న ఎన్టీఆర్‌ పాత్రలోనే అసలు ట్విస్ట్ ?

First Published Sep 18, 2024, 1:00 PM IST

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` చిత్రంలోని అసలు స్టోరీ బయటకు వచ్చింది. అదే సమయంలో అసలు ట్విస్ట్ కూడా లీక్‌ అయ్యింది. ఇదే ఇందులో హైలైట్‌గా నిలవబోతుందట. 
 

ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ బాగా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సినిమా `దేవర`. ఇది ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటించిన మొదటి పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. అంతేకాదు ఆరేళ్ల తర్వాత తారక్‌ నటించిన సోలో మూవీ కూడా ఇదే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా చేశాడు. ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌ పాత్రలు కీలకంగా ఉండబోతన్నాయి. ఈ సినిమాలో తారక్‌ రెండు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర అని తెలుస్తుంది. ఫస్ట్ లుక్‌లు విడుదల చేసినప్పుడే ఆ డిఫరెంట్స్ ని పోస్టర్స్ లో వెల్లడించింది టీమ్‌. 

యష్మిలో ఎన్ని షేడ్సా? బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్‌, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మెయిన్‌ స్టోరీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో `దేవర` సినిమా కథ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల. 1989-90లో కోస్టల్‌ ఏరియాలో జరిగే కథ అని తెలిపారు. ఆ ప్రాంతంలోని నాలుగు గ్రామాల పూర్వీకులు ఆయుధాలను పూజిస్తుంటారు.

గుర్తింపుకి నోచుకోని నాలుగు ఊర్ల మధ్య ఈ కథ నడుస్తుందని, పోర్ట్ పై ఆధిపత్యం కోసం ఈ ఊర్ల మధ్య గొడవలు అవుతుంటాయని, పోర్ట్ దేవర ఆధిపత్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఆ పోర్ట్ కి వచ్చే భారీ షిప్‌ల నుంచి విలువైన వస్తువులను దొంగిలించడం ఈ ఊర్లలో ప్రత్యర్థులు చేసే పని. దీన్ని దేవర అడ్డుకుంటాడు. అందుకే అతనంటే ఎవరికీ పడదు. మరో వైపు దేవర అంటే అందరికి హడల్. 
 

Latest Videos


Junior NTR Devara upcoming film update out

ఓ రకంగా ఎన్టీఆర్‌ దేవర పాత్ర నెగటివ్‌ షేడ్‌లో ఉంటుందట. అదే సమయంలో ప్రధానమైన గొడవ ఒకే ఫ్యామిలీలో జరుగుతుందని తెలుస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ నటించిన భైర ది కూడా దేవర ఫ్యామిలీనే అని, కానీ అతని బుద్ది మరోలా ఉంటుందని, దోచుకోవాలని, ఆధిపత్యం చలాయించాలని చూస్తుంటాడని టాక్‌. కానీ దేవర ఒప్పుకోడు, అడ్డుపడుతుంటాడు.

దీంతో దేవర అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. అందుకోసం భైర పాత్ర చేసే కుట్ర ప్రధానంగా సినిమా సాగుతుందని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లోనూ ఇది స్పష్టమైందని చెప్పొచ్చు. మొదట్లో దేవర, భైర మంచి స్నేహితులుగా ఉంటారు, మరి వాళ్ల మధ్య గొడవలకు మూలం ఎక్కడుందనేది మిగిలిన కథ. అక్కడి నుంచే ఈ ఇద్దరు శత్రువులుగా మారతారు. పోర్ట్ పై ఆధిపత్యం కోసం కొట్టుకుంటారని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే `దేవర` కథలో అసలు మ్యాటర్‌ లీక్‌ అయ్యింది. ట్రైలర్‌ లో చూపించినట్టు దేవర రెండేళ్లు కనిపించకుండా పోతారు. సముద్రంలో జరిగే ఫైట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత దేవర కనిపించరు. దీంతో అంతా ఆయన కోసం వెయిట్‌ చేస్తుంటారు. దేవర చనిపోయాడా? బయపడి పారిపోయాడా? పంతం కోసం దూరమయ్యాడా? అనేది ఆసక్తికరం.

ట్రైలర్‌లో పంతం కోసం మీ కొడుకు వెళ్లిపోయాడు అని చిన్న ఎన్టీఆర్‌ చెబుతాడు. మరి ఆ పంతం ఏంటనేది సస్పెన్స్. అదే సమయంలో ట్రైలర్‌లో మరో హింట్‌ వదిలారు దర్శకుడు కొరటాల. దేవరని చంపాలంటే సరైన సమయం మాత్రమే కాదు, సరైన ఆయుధం కావాలని భైర పాత్ర చెప్పడంతో ఆ సమయంలోనే చిన్న ఎన్టీఆర్‌ని చూపించడం విశేషం.

ఇక్కడే అసలు మ్యాటర్‌ ఉంది. దేవరని చంపేది కొడుకు వర నా ? అనేది క్రేజీగా మారింది. తెలుస్తున్న సమచారం మేరకు దేవరని కొడుకు వరనే చంపుతాడని సమాచారం. ఇదే ఇందులో అసలు ట్విస్ట్ అట.
 

భైర కుట్ర పన్ని, పక్కాగా స్కెచ్‌ వేసి, తండ్రిపైకి వరని ఉసిగోల్పి చంపాలనే కోపం, కక్ష్యని రగిల్చి చివరికి కొడుకు చేతనే చంపిస్తాడని తెలుస్తుంది. ఇదే ఈ సినిమాలో మెయిన్‌ పాయింట్‌ అని టాక్‌. చిన్న ఎన్టీఆర్‌ పాత్రలోని ఈ ట్విస్టే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ ట్విస్ట్ వర్కౌట్‌ అయితే సినిమా రేంజ్‌ వేరేలా ఉంటుంది.

అదే తేడా కొడితే మాత్రం దారుణంగా డిజాస్టర్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి కొరటాల దీన్ని ఎలా డీల్‌ చేశాడనేది ఇక్కడ మెయిన్‌ పాయింట్‌. ఆయన డీల్ చేసేదాన్ని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంది. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు `దేవర 1` సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. ఈ మూవీ విజయాన్ని బట్టి రెండో పార్ట్ ఉండబోతుందని టాక్‌. 

click me!