మొన్న `పుష్ప2`, ఇప్పుడు `దేవర` లో.. అదే సెంటిమెంట్‌.. వర్కౌట్‌ అయితే థియేటర్లలో `జాతరే`

Published : Dec 25, 2023, 11:33 AM ISTUpdated : Dec 25, 2023, 03:32 PM IST

సినిమాలో జాతర ఎపిసోడ్లు ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారుతున్నాయి. ఇటీవల చాలా సినిమాల్లో ఇవి రకరకాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌ `దేవర`లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారట. 

PREV
15
మొన్న `పుష్ప2`, ఇప్పుడు `దేవర` లో.. అదే సెంటిమెంట్‌.. వర్కౌట్‌ అయితే థియేటర్లలో  `జాతరే`
Devara

ఎన్టీఆర్‌ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. `దేవర` ప్రీ ప్రొడక్షన్‌ కోసమే ఆయన ఏడాదిపాటు వెయిట్‌ చేశారు. దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఓ కొత్త స్టోరీని ఆడియెన్స్ కి చెప్పబోతున్నారు. సముద్ర తీరంలోని కోస్టల్‌ ఏరియాలో గుర్తింపుకు నోచుకోని ఓ దివి సీమ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారంగా ఈ మూవీ ఉండబోతుందట. ఆ ప్రాంతంలో మనుషులకు భయం అనేదే తెలియదు. అత్యంత క్రూరంగా ఉంటారు. అలాంటి వారికి హీరో భయాన్ని పరిచయం చేశాడు. భయమే భయపడేలా ఎలా చేశాడనేది ఈ కథ అని కొరటాల తెలిపారు. 

25

సినిమా ఎక్కువ నీటిలోనే సాగుతుందట. దీనికోసం ప్రత్యేక సెట్స్ కూడా వేశారని సమాచారం. ఎక్కువగా అందులోనే చిత్రీకరణ జరుగుతుందట. ఇదిలా ఉంటే సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏమాత్రం గ్యాప్‌ లేకుండా షూట్‌ చేస్తున్నారు దర్శకుడు కొరటాల. అనుకున్న టైమ్‌ కంటే ఏడాది లేట్‌గా సినిమా ప్రారంభం కావడంతో ఆ లేట్‌ని భర్తీ చేసేలా షూటింగ్‌ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ రాబోతుందట. గ్లింప్స్ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారని కళ్యాణ్‌ రామ్‌ తెలిపారు. సంక్రాంతికి అది ఉండొచ్చు.

35

ఇదిలా ఉంటే `దేవర` సినిమాలో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ని ప్లాన్‌ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఓ క్రేజీ రూమర్‌ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ని చాలా ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారట. భారీ యాక్షన్‌ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇంటర్వెల్‌లో వచ్చే గంగమ్మ జాతర లో తారక్.. గంగమ్మ తల్లి భక్తుకుడిగా కనిపిస్తారని తెలుస్తుంది. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. ఇందులో ఎన్టీఆర్‌ నటన మతిపోయేలా ఉంటుందట. గూస్‌ బంమ్స్ తెప్పిస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఏంటో తెలియాల్సి ఉంది.  ఇక ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్‌ అలీ ఖాన్ విలన్ పాత్రని పోషిస్తున్నారు. 

45

అయితే చూడబోతుంటే.. `పుష్ప2`ని `దేవర` ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. `పుష్ప2`లోనూ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో పోలేరమ్మ జాతర ఎపిసోడ్‌ ఉంటుందట. అందులో బన్నీ అమ్మోరు వేషధారణలో కనిపించనున్నారు. అంతేకాదు ఆ సమయంలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్ ఉంటుందట. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇది చాలా రోజుల క్రితమే షూట్‌ చేశారు, దానికి సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు `దేవర`లోనూ అలాంటి సీక్వెన్స్ ని ప్లాన్‌ చేయడం యాదృశ్చికమైనా, అదొక ట్రెండ్‌గా మారుతుంది. 

55

ఇదిలా ఉంటే ఇటీవల భారీ సినిమాల్లో చాలా వరకు ఇలాంటి జాతర సీన్లు, దేవుడిని కొలిచే సీన్లు పెడుతున్నారు దర్శకులు. అది సెంటిమెంటల్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. మన కల్చరల్‌ సెంటిమెంట్‌గానూ ఉంటుంది. అందుకే ఈ కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారట. `కేజీఎఫ్‌`లోనూ అలాంటి సీన్‌ ఒకటి ఉంది. అలాగే `సలార్‌`లోనూ కాటేరమ్మ ఫైట్‌ సీన్‌ ఉంది. మరోవైపు నాగార్జున నటిస్తున్న `నా సామి రంగ`లోనూ అలాంటిదే ఒకటి ఉందట. మొత్తానికి ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories