లెహంగా వోణీలో మెరిసిపోతున్న శ్రీలీలా.. నిషా కళ్లతో మైమరిపిస్తున్న క్రేజీ హీరోయిన్

First Published | Jul 21, 2023, 6:56 AM IST

యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాతో సైలెంట్ గా వచ్చిన భారీ ప్రాజెక్ట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు నెట్టింట సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ శ్రీలీలా పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఏ ప్రాజెక్ట్స్ షురూ అవుతున్న లీడ్ యాక్ట్రెస్ కోసం ఈ ముద్దుగుమ్మ పేరును పరిశీలించేలా చేసింది. తన నటన, అందం, టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. 
 

ప్రస్తుతం ఏడెనిమిది సినిమాలతో శ్రీలీలా ఫుల్ బిజీగా ఉంది. ఒక్కో సినిమాను పూర్తి చేస్తూ వస్తోంది. చివరిగా శ్రీలీలా ‘ధమాఖా’ మూవీతో అలరించింది. మంచి సక్సెస్ ను కూడా అందుకుంది. నెక్ట్స్ వరుస చిత్రాలతో వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
 


శ్రీలీలా సినిమాల పరంగా ఎంత దూకుడుగా ఉందో తెలిసిందే. ఇక అంతే క్రేజ్ నెట్టింట కూడా సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది.  ఈ మేరకు బ్యూటీఫుల్ లుక్స్ లో ఫొటోషూట్లు కూడా చేస్తోంది.
 

తాజాగా శ్రీలీలా అదిరిపోయే లెహంగా వోణీలో దర్శనమిచ్చింది. క్లాస్ డిజైన్ గల సిల్వర్ లెహంగా, ఫుల్ స్లీవ్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ వోణీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అందమైన అవుట్ ఫిట్ లో మరింత అందంగా మెరిసింది. ట్రెడిషనల్ వేర్ శ్రీలీలా బ్యూటీని మరింతగా పెంచిందనే చెప్పాలి. 
 

బ్యూటీఫుల్ లుక్ లో ఆకట్టుకోవడమే కాకుండా.. అదిరిపోయే ఫొటోషూట్లతోనూ అట్రాక్ట్ చేసింది. మత్తు చూపులు, వెలిగిపోతున్న రూపసౌందర్యంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. క్యూట్ గా చిరునవ్వు విసురుతూ కుర్ర హృదయాలకు తీపి గాయం చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

ప్రస్తుతం శ్రీలీలా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, ‘స్కంద’, ‘నితిన్32’, ‘ఆదికేశవ’, ‘గుంటూరుకారం’, ‘వీడీ12’ వంటి ఏడు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే కన్నడలో ‘జూనియర్’గా రూపుదిద్దుకుంటున్న చిత్రంలోనూ శ్రీలీలా కథానాయికగా అలరించబోతోంది. 
 

Latest Videos

click me!