బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ తీపి కబురును తమ మొదటి కూతురు దువా చేతిలో ఉన్న ఫొటోతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కూతురి ద్వారా గుడ్ న్యూస్ చెప్పిన దీపికా, రణ్‌వీర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, హీరో రణ్‌వీర్ సింగ్ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. తమ మొదటి కూతురు దువా చేతిలో ఉన్న ఒక ఫొటోను షేర్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు దీపికా, రణ్‌వీర్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
24
దువా చేతిలో ప్రెగ్నెన్సీ కిట్‌తో ప్రకటన
దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటకు సెప్టెంబర్ 8, 2024న మొదటి సంతానంగా కూతురు దువా పుట్టింది. ఇప్పుడు రెండో బిడ్డ రాకను ఈ జంట సోషల్ మీడియాలో ప్రకటించింది. వాళ్లు షేర్ చేసిన ఫొటోలో, గారాల కూతురు దువా పాజిటివ్ అని చూపిస్తున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌ను పట్టుకుని ఉంది. 'మా అమ్మానాన్న మళ్లీ పేరెంట్స్ అవుతున్నారు' అని ఆ చిన్నారి ప్రకటిస్తున్నట్లుగా ఈ ఫొటోను క్రియేట్ చేశారు.
34
దీపికా, రణ్‌వీర్ ప్రేమ పెళ్లి..
దీపికా, రణ్‌వీర్ సింగ్ 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. దీపికా కుటుంబ సంప్రదాయమైన కొంకణి, రణ్‌వీర్ కుటుంబ సంప్రదాయమైన సింధీ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది.2013లో 'గోలియోం కీ రాస్‌లీలా రామ్-లీలా' సినిమా సెట్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. చాలా ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత, 2015లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. 2018లో పెళ్లితో తమ బంధాన్ని అధికారికం చేశారు.
దీపికా , రణ్ వీర్ సింగ్ ఇద్దరు విడిపోతున్నారంటూ.. చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఏదో ఒక సందర్భంగా ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు బాలీవుడ్ కపుల్.. ఇక రీసెంట్ గా కూడా ఈ జంట పెళ్లి బంధాన్ని బ్రేక్ చేసుకోబోతుందంటూ న్యూస్ వైరల్ అయ్యింది. అటువంటి సందర్భంగా వారికి ఈ పోస్ట్ తో గట్టి సమాధానం చెప్పారు దీపికా పదుకోణ్, రణ్ వీర్ సింగ్.