Published : May 18, 2022, 12:48 PM ISTUpdated : May 18, 2022, 12:53 PM IST
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు హాజరైన బాలీవుడ్ బ్యూటీ రోజుకో అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా భారతీయ స్త్రీగా చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చీరకున్న గొప్పతనంపై ఆసక్తికరంగా కామెంట్ చేసింది దీపికా.
2017 నుంచి కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరవుతోందీ బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone). ఇటీవల ఫ్రాన్స్ లో ప్రారంభమైన 75వ వార్షిక కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ నెల 17 నుండి 28 వరకు ఫ్రాన్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
27
ఈ గ్లోబల్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో గల ఓ కన్వెన్షన్ సెంటర్ పలైస్ డెస్ లో ఈ ఈవెంట్ బ్రహ్మండగా కొనసాగుతోంది. ఈ గ్లోబల్ ఈవెంట్ కు జూరీ మెంబర్ గా రెండు రోజుల ముందే హాజరైంది దీపికా. అంతకు ముందు యూఎస్ లో ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.
37
ఫెస్టివల్‌లో తొలిరోజు రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా జ్యూరీ డిన్నర్‌కు హాజరయ్యారు. జ్యూరీ సభ్యులలో ఒకరిగా అక్కడికి వెళ్లిన ఆమె తన సీక్విన్డ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ కట్టిపడేస్తోంది.
47
దీపికాతో పాటు ఇతర జ్యూరీ సభ్యులు.. నటుడు-చిత్రనిర్మాత రెబెక్కా హాల్, నూమి రాపేస్, ఇటాలియన్ నటుడు, దర్శకుడు జాస్మిన్ ట్రింకా, అలాగే దర్శకులు అస్గర్ ఫర్హాది, లాడ్జ్ లై, జెఫ్ నికోల్స్ కూడా డిన్నర్ లో పాల్గొన్నారు.
57
ఇంకా ఫెస్టివల్ లోనే కొనసాగుతున్న దీపికా తాజాగా భారతీయ స్త్రీగా చీరకట్టులో దర్శనమిచ్చింది. ప్రారంభోత్సవ వేడుకలో రెడ్ కార్పెట్ మీద శారీ ధరించి నడిచింది. మెరిసే బంగారు మరియు నలుపు రంగు గల చీరలో అక్కడి వారి హృదయాలను దోచుకుంటోంది.
67
ఈ సందర్భంగా కేన్స్‌లోని హోటల్ మార్టినెజ్ నుండి దీపిక పలు ఫొటోలను తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్ పెడుతూ చీరపై చాలా ఆసక్తికరంగా క్యాప్షన్ పెట్టింది. ప్రముఖ డిజైనర్, నటి సబ్యసాచి గోల్డెన్ మాటలను గుర్తు చేసుకుంటూ ఇలా రాసింది.
77
‘చీర అనేది నేను ఎప్పటికీ చెప్పడం ఆపని కథ. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, చీరకు ప్రత్యేక స్థానం ఉంది.. అని నటి సబ్యసాచి ముఖర్జీ అన్నారు. ప్రస్తుతం నేను ఆమె మాటలను మరింతగా అంగీకరిస్తున్నాను’ అంటూ గ్లోబల్ ఈవెంట్ నుంచి చీరగొప్పతనం చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా ప్రస్తుతం దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’లో నటిస్తోంది.