దీపికా పదుకొనె టూ అనుష్క శర్మ... మానసిక సమస్యలు ఎదుర్కొన్న స్టార్స్!

First Published | Dec 29, 2020, 1:30 PM IST

కోట్ల మంది అభిమానులు, మీడియా అటెంషన్, కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్... స్టార్స్ జీవితం గురించి ఎవరైనా మాట్లాడుకునేది ఇదే. వెండితెరపై వెలిగిపోయే తరాల జీవితాలు కూడా సమస్యల మయమే. ఆ సమస్యలు వారిని మానసికంగా కృంగదీసి, ప్రాణాలు తీసుకునేలా కూడా చేస్తాయి. ఇటీవల జరిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ దీనికి ఒక ఉదాహరణ. బాలీవుడ్ లో తిరుగులేని స్టార్స్ గా వెలుగొందుతున్న కొందరు స్టార్స్ తాము మానసిక రుగ్మతల బారినపడినట్లు ఒప్పుకున్నారు. వీరెవరో... వారి మానసిక వేదనకు కారణం ఏమిటో తెలుసుకుందాం... 

బాలీవుడ్ దివా దీపికా పదుకొనె అనేక ఇంటర్వ్యూలలో తాను డీప్ డిప్రెషన్ లోకి వెళ్లానని తెలియజేశారు. మెంటల్ ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్న వారి కోసం దీపికా ఓ సెంటర్ ప్రారంభించడం విశేషం. తన మానసిక సమస్య గురించి దీపికా మాట్లాడుతూ.. ''మొదట్లో నేను స్ట్రెస్ అనుకునేదాన్ని, వర్క్ పై కాన్సన్ట్రేట్ చేయడం, చుట్టూ ఉన్న వారితో కలిసిపోవడం ద్వారా దాని నుండి బయటికి రావడానికి ట్రై చేసేదాన్ని... అయినా ఆ బాధ నన్ను వదలలేదు. శ్వాస సరిగా అందేది కాదు. తెలియకుండానే గట్టిగా ఏడ్చేసే దానిని'' అని దీపికా తన సమస్య గురించి చెప్పారు. నిపుణులైన వైద్యుల సహాయంతో తన మానసిక సమస్య నుండి బయటపడినట్లు దీపికా తెలియజేశారు.
స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కొన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారట. ఆమె తరచుగా ఆందోళనకు గురయ్యేవారట. దీని నుండి బయటికి రావడానికి అనుష్కమెడిటేషన్ చేసేవారట. అలాగే వైద్యుల సలహా మేరకు మెడిసిన్ వాడినట్లు ఆమె చెప్పారు. మనిషికి ఉండే బయోలజికల్ ప్రాబ్లమ్స్ లో ఆందోళన కూడా ఒకటి, దీనిని నేను దాచాలనుకోలేదు, మా కుటుంబంలో కొందరు ఈ సమస్యను ఎదుర్కొన్నారని ఆమె తెలియజేశారు.

లెజెండరీ నటుడు అమితాబ్బచ్చన్ కూడా ఒక దశలో డిప్రెషన్ సమస్య ఎదుర్కొన్నాడట. 1996లో ఏ బి సి ఎల్పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థలోనిర్మించిన చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయట. అప్పులపాలైన అమితాబ్బచ్చన్, డిప్రెషన్ కి గురయ్యారట. మెల్లగా ఆ సమస్య నుండి బయటపడినట్లు అమితాబ్ తెలియజేశారు.
2010లో కింగ్ ఖాన్ షారుక్ తన భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో షారుక్ మానసిక వేదనకు గురయ్యారట. కుటుంబం, మిత్రులు సహకారంతో ఆ సమస్య నుండి బయటపడినట్లు చెప్పిన షారుక్ పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.
1990 నుండి 2000 వరకు స్టార్ హీరోయిన్ గా తిరుగులేని విజయాలు అందుకుంది మనీషా కొయిరాలా. అయితే స్మోకింగ్, మద్యపానం వంటి వ్యసనాలు ఆమె కెరీర్ ని నాశనం చేశాయి. ఓవరియన్ క్యాన్సర్ బారిన పడిన మనీషా కొయిరాలా మానసిక సమస్యలతో బాధపడ్డారు. క్యాన్సర్ ని జయించిన మనీషా ప్రస్తుతం సినిమాలు పెద్దగా చేయడం లేదు.

Latest Videos

click me!