Pooja Gandhi: పెళ్లి పీటలెక్కబోతున్న దండుపాళ్యం నటి.. భాష నేర్పించిన వాడినే ముగ్గులోకి దించిందిగా..

సౌత్ లో వచ్చిన బోల్డ్ క్రైమ్ చిత్రాలలో దండుపాళ్యంకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి మూడు భాగాలు వచ్చాయి. దండుపాళ్యం సిరీస్ తో నటి పూజా గాంధీ బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

సౌత్ లో వచ్చిన బోల్డ్ క్రైమ్ చిత్రాలలో దండుపాళ్యంకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి మూడు భాగాలు వచ్చాయి. దండుపాళ్యం సిరీస్ తో నటి పూజా గాంధీ బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది. విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం దండుపాళ్యం అనే చెప్పాలి. 

నటి పూజా గాంధీ 2001 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. 40 ఏళ్ల పూజా గాంధీ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలో పూజా గాంధీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజా గాంధీ వయసు 40 ఏళ్ళు. 


ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని అయిన విజయ్ అనే వ్యక్తిని పూజా గాంధీ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. నవంబర్ 29న బెంగుళూరులో వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. 

పూజా గాంధీ స్వతహాగా బెంగాలీ అమ్మాయి. ఆమె బెంగుళూరుకి వచ్చి కన్నడ చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు విజయ్ తో పరిచయం ఏర్పడిందట. విజయ్ స్వయంగా పూజా గాంధీకి కన్నడ నేర్పించాడట. దీనితో పూజా సులభంగా కన్నడ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. విజయ్ సహకారంతోనే ఆమె నటిగా రాణించినట్లు తెలుస్తోంది. 

ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2012లో పూజా గాంధీకి ఒక వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే అతడితో పూజా బ్రేకప్ చేసుకుంది. ఆమెకి గతంలో ఓ డిస్ట్రిబ్యూటర్ ని పెళ్లి చేసుకున్నట్లు కూడా రూమర్స్ ఉన్నాయి. 

మొత్తంగా పూజా గాంధీ తనకి భాష నేర్పించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటోంది. దండుపాళ్యం చిత్రంలో ఆమె పాత్ర ఎంతో బోల్డ్ గ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Latest Videos

click me!