షాక్ :'ఉప్పెన' క్లైమాక్స్ అదా? జనాలకి పడితే బ్లాక్ బస్టరే

First Published | Feb 9, 2021, 12:48 PM IST


ఏ సినిమాకు అయినా ఇంటర్వెల్,క్లైమాక్స్ బాగుంటే పట్టేస్తుందని చాలా సార్లు తెలుగు తెర సాక్షిగా ప్రూవ్ అయిన సత్యం. ఎన్నో పెద్ద సినిమాలు క్లైమాక్స్ లో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించి దుమ్ము రేపాయి. ప్రేమిస్తే, 7బై జి బృందావన్ కాలనీ వంటి చిత్రాల క్లైమాక్స్ మనస్సు చలించిపోయేలా చేసినా అద్బుతం అనిపించి భాక్సాఫీస్ వద్ద అద్బుతాలు జరిగాయి. అలాంటి క్లైమాక్సే ఇప్పుడు ఉప్పెనలో చూడబోతున్నాం అంటున్నారు సిని జనం. 

మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
రీసెంట్ గా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని నిర్మాతలు ప్రకటించారు. పిబ్రవరి 12 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్ లో భాగంగా విడుదలై ఈ చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమంయలో ఈ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ గురించి అంతటా చర్చగా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునే దాని ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ విషాదాంతం అని చెప్పుకుంటున్నారు. విషాదాంతాలు అప్పటి దేవదాసు, మరో చరిత్ర నాటి నుంచి ఎన్నో వచ్చాయి కానీ ఈ సారి ఊహించని మలుపుతో ఈ ఎండింగ్ ఉంటుందంటున్నారు.
హీరోకి విలన్ తన కూతురుని ప్రేమించినందుకు వేసే శిక్ష..చాలా దారుణంగా ఉంటుందని, అది వింటే షాక్ అవుతారని, చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ రాని ఆ ముగింపు కనుక ప్రేక్షకులకు పడితే సినిమా ఎక్కడికో వెళ్లిపోతుందంటున్నారు.
ఇప్పటికే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న క్లైమాక్స్‌ని చూసి అరే.. అయ్యో అని ప్రేక్ష‌కులు అనుకుంటార‌ని తెలిపారు. దీంతో ఉప్పెన క్లైమాక్స్ విషాదాంతంగా ఉండ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.
‘ఉప్పెన క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. అలాంటి ముగింపు తెలుగు సినిమాల్లో చూడటం కష్టమే. అని చిరు చెప్పాడు. ఓ రేర్ క్లైమాక్స్ ని డైరెక్టర్ బుచ్చిబాబు రాసుకున్నాడు.’ అంటూ చిరు క్లైమాక్స్ గురించి హింట్ ఇచ్చేసాడు.
‘క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా చెప్పడానికి బుచ్చిబాబు చాలా ప్రయత్నించాడు. అలాంటి క్లైమాక్స్ చెప్తున్నపుడు డైరెక్టర్లు భయపడతరు. కానీ బుచ్చిబాబు మాత్రం చాలా డేరింగ్ గా చెప్పాడు.’ అంటూ అసలు విషయాన్ని చెప్పారు చిరు. ఈ నేపధ్యంలో ఈ సినిమా క్లైమాక్స్ గురించి అంతటా చర్చనీయాంశంగా మారింది.
కొందరు హీరోని చంపేస్తారు అంటూంటే,మరికొందరు అదేం కాదు చేతులు నరికేస్తాడు అని చెప్తున్నారు. కొందరేమో మరికాస్త ముందుకు వెళ్లి హీరోని నపుంసుకుడు చేసేస్తాడు విలన్ అని చెప్తున్నారు. ఇంతకీ వీటిల్లో ఏది నిజం.. ఆ క్లైమాక్స్ ఏమిటో, ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ నెల 12 వరకు ఆగాల్సిందే.
ఈ సినిమా ఇంటర్వెల్ కు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సాధారణంగా సినిమాల్లో ఇంటర్వెల్ అంటే ఊహించని ట్విస్ట్ తో ఉంటుంది.అయితే ఈ సినిమాలో మాత్రం హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్ తో ఇంటర్వెల్ ఉండనుందని తెలుస్తోంది.
హీరో,హీరోయిన్స్ మధ్య జరిగే ఓ రొమాంటిక్ సీన్ తో ఇంటర్వెల్ పడుతుందని చెప్పుకుంటున్నారు. ఆ సీన్ సినిమాలో హైలెట్ కానుందిట. అలాగే ఈ సీన్ సినిమా కథని మలుపు తిప్పుతుందని, కథ టోన్ మారుస్తుందని చెప్తున్నారు. అప్పటిదాకా లవ్ స్టోరీగా నడిచిన కథ ఈ సీన్ తర్వాత వైలెంట్ గా మారుతుందని వినికిడి. చూడాలి మరి ఈ లీక్ టాక్ లో నిజమెంత అనేది.
ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 18 – 20 కోట్లు చేయాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే సినిమాకి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు
మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Latest Videos

click me!