బాద్షాని రౌడీలతో బెదిరించిన రష్మిక.. ఫస్ట్ టైమ్‌ వీడియో సాంగ్‌లో.. దుమ్మురేపుతున్న `టాప్‌ టక్కర్‌` టీజర్‌

First Published Feb 9, 2021, 12:06 PM IST

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా దూసుకుపోతుంది. ఫస్ట్ టైమ్ ఓ వీడియో సాంగ్‌లో మెరిసింది. హిందీలో టాప్‌ ర్యాప్‌ సింగర్‌ బాద్షాతో కలిసి హంగామా చేసింది. `టాప్‌ టక్కర్‌` అంటూ సాగే ఈ సాంగ్‌లో లేడీ డాన్‌ తరహా గెటప్‌లో దుమ్మురేపుతుంది. అయితే ఇందులో ఛాన్స్ కోసం రష్మిక రౌడీలతో బెదిరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ టీజర్‌ ట్రెండ్‌ అవుతుంది. 

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్నా తాజాగా ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌లో మెరిసే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఫస్ట్ టైమ్‌లో `టాప్‌ టక్కర్‌` అనే ఆల్బమ్‌లో మెరుస్తుంది.
undefined
హిందీ పాపులర్‌ ర్యాప్‌ సింగ్‌ బాద్షా, ఉచన అమిత్‌ కలిసి చేసిన `టాప్‌ టక్కర్‌` వీడియో సాంగ్‌లో నటించింది. ఈ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని యువన్‌ శంకర్‌ రాజా కంపోజ్‌ చేయడం విశేషం.
undefined
ప్రస్తుతం ఈ సాంగ్‌ టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో రష్మిక ఎంట్రీ అదిరిపోయేలా ఉంది. పైగా ఈ సాంగ్‌ కోసం రష్మిక.. రౌడీలను పెట్టి మరీ బాద్షాని, అమిత్‌ని బెదిరించినట్టుగా ఈ టీజర్‌లో చూపించారు. అయితే ఆ ఇద్దరు రౌడీలు ఎవరో కాదు బాద్షా, అమితే కావడం విశేషం.
undefined
బెదిరించి మరీ ఇందులో ఛాన్స్ కొట్టేసినట్టుగా పోజ్‌ ఇచ్చింది రష్మిక. అందుకు విజయ్‌ దేవరకొండని వాడుకుంది. `గీతగోవిందం`లోని ఫేమస్‌ పోజుని రిపీట్‌ చేసింది. లేడీ డాన్‌గా హంగామా చేసింది.
undefined
`టాప్‌ టక్కర్‌` అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో రష్మికతోపాటు బాద్షా, అమిత్‌, యువన్‌ శంకర్‌ రాజా, జోనితా గాంధీ పర్‌ఫెర్మ్ చేస్తూ సాంగ్‌ని ఆలపించారు. తాజాగా ఈ టీజర్‌ విడుదల చేయగా, 24గంటల్లో రెండు మిలియన్స్ వ్యూస్‌ని పొందింది. ఇంకా దూసుకుపోతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. త్వరలో పూర్తి వీడియో సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.
undefined
టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా ఇటీవల బాలీవుడ్‌లో ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `మిషన్‌మజ్ను` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది.
undefined
అలాగే అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందే సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతోపాటు ఇప్పుడు స్పెషల్‌ వీడియో సాంగ్‌లో మెరవబోతుండటం విశేషం. ఈ లెక్కన రష్మిక దూకుడుకి అవదుల్లేవనే చెప్పాలి. కేవలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐదేళ్లలోనే ఈ రేంజ్‌లో దూసుకుపోవడం రష్మికకే సాధ్యమైంది.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్‌కి హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళంలో `సుల్తాన్‌`లో, కన్నడలో `పొగరు` చిత్రంలో నటించింది.
undefined
click me!