‘అల్లు స్టూడియో’లోనూ భారీ సెట్ వేయించినట్టు కూడా తెలుస్తోంది. ‘పుష్ఫ 2’లోని ఓ కీలక సన్నివేశాన్ని ఈ స్టూడియోలోనే చిత్రీకరించేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. ఏదేమైనా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సునీల్, అనసూయ, కేశవ, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.