జెమినీ గణేషన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సావిత్రి. ఆ సమయంలో ఓ రోజు జెమినీ గణేషన్ కార్ డ్రైవ్ చేస్తుండగా, సావిత్రి పక్కన వచ్చిన ఏఎన్నార్ కూర్చున్నాడట. ఇది అన్నపూర్ణమ్మ చూశారు. ఆమె రియాక్షన్ ఏంటంటే?
సావిత్రి, జెమినీ గణేషన్, ఏఎన్నార్ మధ్య ఆసక్తికర సంఘటన
అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘీకాలు ఇలా అన్ని రకాల చిత్రాలు చేసి మెప్పించారు. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలతో అలరించారు. మహిళా ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆయన స్టార్‌గా రాణిస్తున్న సమయంలోనే సావిత్రి సినిమాల్లోకి వచ్చింది. ఆయనతోనే మొదట సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే సావిత్రి జెమినీ గణేషన్‌కి పడిపోయిన తర్వాత ఏఎన్నార్, సావిత్రిల మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దీనికి ఏఎన్నార్ భార్య అన్నపూర్ణమ్మ రియాక్షన్ క్రేజీ అని చెప్పొచ్చు.
23
జెమినీ గణేషన్ ముందే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్
ఒక సారి జెమినీ గణేషన్, సావిత్రి, ఏఎన్నార్ ఎక్కడికో వెళ్తున్నారు. జెమినీ గణేషన్, సావిత్రి కారులో.. అక్కినేని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఏఎన్నార్ వచ్చి కారు ఎక్కారు. అయితే ఆ సమయంలో జెమినీ గణేషన్ కారు డ్రైవ్ చేస్తున్నారట. మిడిల్‌లో కూర్చుందట. అయితే ఏఎన్నార్ వస్తున్నారని చెప్పి ఆమె సైడ్‌కి జరిగిందట. ఆ సమయంలో ఏఎన్నార్ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడట. ఇదంతా.. కిటికీలోంచి ఏఎన్నార్ భార్య అన్నపూర్ణమ్మ చూస్తున్నారు.
33
అన్నపూర్ణమ్మ రియాక్షన్ క్రేజీ
జెమినీ గణేషన్ ఉండగా.. సావిత్రి పక్కనే ఏఎన్నార్ కూర్చోవడంతో అన్నపూర్ణమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. వెళ్లి వెనకాల కూర్చోవచ్చుగా, ఆమె పక్కనే ఎందుకు కూర్చోవాలని అన్నాదట. ఆ సమయంలో అన్నపూర్ణమ్మ చాలా జెలసీగా ఫీలయ్యిందట. ఈ విషయాన్ని ఏఎన్నార్ పెద్ద కొడుకు.. నాగార్జున అన్నయ్య వెంకట్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈ విషయం తనకు వాళ్ల అమ్మనే స్వయంగా చెప్పిందట. తనకు అంత వరకే తెలుసు అని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు, తనని అడగొద్దని చెప్పారు వెంకట్. మొత్తంగా ఆ తర్వాత ఏదో జరిగిందనే విషయం హింట్ ఇచ్చారు వెంకట్. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.