అమ్మను అద్భుతంగా మార్చేసిన అకీరా... రేణు దేశాయ్ కి మాత్రం భయమేస్తుందట, కారణం!

Published : Jul 16, 2023, 10:07 AM IST

రేణు దేశాయ్ లేటెస్ట్ లుక్ షాక్ ఇస్తుంది. దీని వెనుక కొడుకు అకీరా హస్తం ఉంది. అకీరా నందన్ కృతిమ మేధ సహాయంతో అమ్మ రేణును ఇలా మార్చేశాడు.   

PREV
16
అమ్మను అద్భుతంగా మార్చేసిన అకీరా... రేణు దేశాయ్ కి మాత్రం భయమేస్తుందట, కారణం!
Renu Desai

రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టీవ్. టీనేజ్ లో ఉన్న ఈ యంగ్ ఫెలో పలు విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉంది. అకీరా పియానో గొప్పగా ప్లే చేస్తాడు. అప్పుడే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అంతటి టాలెంట్ మనోడి సొంతం. 


 

26
Renu Desai

ఇక సాంకేతిక విషయాల మీద కూడా పట్టుంది. ప్రస్తుతం కృత్రిమ మేధ ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రాథమిక దశలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విజయాలు విస్తు గొలుపుతున్నాయి. అదే సమయంలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్న కృత్రిమ మేధ మనుషులను నిరోద్యోగులుగా మారుస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్ ఫుట్ క్వాలిటీతో సమకూర్చే కృత్రిమ మేధను కార్పొరేట్ సంస్థలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. 

36
Renu Desai


ఇటీవల హాలీవుడ్ నటులు బంద్ చేశారు. సినిమాల్లో కృత్రిమ మేధ వినియోగం మీద నియంత్రణ విధించాలి. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఇక కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించే మనసులు, వస్తువులు కట్టిపడేస్తున్నాయి. అకీరా నందన్ తన తల్లి రేణు ఫోటోలు కృత్రిమ మేధ సహాయంతో రూపొందించారు. 

 

46

సదరు ఫోటోలను రేణు దేశాయ్ వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇవి అకీరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించాడు. ఒక విధంగా చెప్పాలంటే AI  భయపెడుతుంది అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రేణు సదరు ఫోటోల్లో గొప్పగా ఉన్నారు. 
 

56

ఇక అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. రేణు మాత్రం తన అభిరుచి ప్రకారం ప్రోత్సహిస్తాను, అంటున్నారు. అయితే అకీరా పవన్ కుమారుడు అంటే ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. అకీరా నా కొడుకు, ఎవరైనా పవన్ ప్రస్తావన తెస్తే ఊరుకోను అంటూ మండిపడుతున్నారు.

66
Renu desai

మరోవైపు రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక రోల్ చేస్తున్నారు. దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది.

Read more Photos on
click me!

Recommended Stories