భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్? మొన్నటి వరకు ఎంత? ఇప్పుడెంత?

First Published | Jul 19, 2023, 3:50 PM IST

హీరోయిన్ కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేశారంటూ కథనాలు వెలువడుతున్నాయి. అమ్మడు తన ప్రస్తుత రెమ్యూనరేషన్ కి యాభై శాతానికి పైగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారట. 
 

Keerthy Suresh


కీర్తి సురేష్ కెరీర్ ఊపందుకుంది. ఆమెకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. చెప్పాలంటే మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి సరైన హిట్ లేదు. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినా, కమర్షియల్ చిత్రాల్లో నటించినా బ్రేక్ రాలేదు. గత ఏడాది విడుదలైన సర్కారు వారి పాట భారీ వసూళ్లు రాబట్టింది. మేకర్స్ లెక్కల ప్రకారం సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ వసూళ్లు రెండు వందల కోట్లు. 
 


ఇక సమ్మర్ కానుకగా విడుదలైన దసరా మరో బ్లాక్ బస్టర్. నాని, కీర్తి సురేష్ డీగ్లామర్ రోల్స్ చేశారు. దసరా వంద కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. దసరా క్లీన్ హిట్ గా నిలిచింది. దీంతో కీర్తి సురేష్ దాహం తీరింది. ఈ క్రమంలో కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేశారనే టాక్ వినిపిస్తుంది. 


Keerthy Suresh

ప్రజెంట్ కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ రూ. 2 కోట్ల వరకు ఉందట. దాన్ని ఏకంగా రూ. 3 కోట్లకు పెంచిందట. ఎవరు కొత్త ప్రాజెక్ట్ కోసం సంప్రదించినా మూడు కోట్లు కావాలంటుందట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. రెండు నుండి మూడు కోట్లు అంటే యాభై శాతం వరకు పెంచినట్లే లెక్క. ఆమెకు అంత డిమాండ్ ఉంది మరి. 

ఒకప్పుడు బొద్దుగా ఉండే కీర్తి సురేష్ సన్నబడింది. మహానటి మూవీ కోసం ఆమె కావాలని బరువు పెరిగింది. తర్వాత మునుపటి కంటే కూడా భారీగా తగ్గిపోయింది. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ నుండి బయటపడేందుకు ఆమె ట్రై చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఎంచుకుంటున్న పాత్రలు కూడా బోల్డ్ గా ఉంటున్నాయి.
 


ఇక కీర్తి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.  ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయలేదు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తున్నారు. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. 
 

అలాగే తమిళంలో జయం రవికి జంటగా సైరన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కీర్తి ఆ అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. ఉదయనిధి స్టాలిన్-కీర్తి కాంబోలో నాయకుడు టైటిల్ తో మూవీ ఇటీవల విడుదలైంది. 
 

Latest Videos

click me!