RRR కి రాజకీయ సెగ.. రాంచరణ్ అల్లూరి పాత్ర టార్గెట్ గా సిపిఐ రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 05, 2022, 05:08 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా అడ్డంకులు దాటుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు ఆర్ఆర్ఆర్ రెడీ అయిపోయింది. 

PREV
18
RRR కి రాజకీయ సెగ.. రాంచరణ్ అల్లూరి పాత్ర టార్గెట్ గా సిపిఐ రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా అడ్డంకులు దాటుకుని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు ఆర్ఆర్ఆర్ రెడీ అయిపోయింది. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితంలోని అజ్ఞాత కాలాన్ని దర్శకుడు రాజమౌళి కల్పితంగా మార్చి తెరకెక్కిస్తున్నారు. 

28

అల్లూరి పాత్రలో రాంచరణ్, కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విడుదలకు ముందు వివాదాలు మొదలు కావడం ఇటీవల సహజంగా మారింది. అందులోనూ ఆర్ఆర్ఆర్ ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల జీవితాలతో ముడిపడిన కథ. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి పొలిటికల్ సెగ రాజుకుంది . 

38

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రని వక్రీకరిస్తున్నారు అంటూ సిపిఐ రామకృష్ణ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రామకృష్ణతో పాటు అల్లూరి సీతారామరాజుకి మేనల్లుడు వరుస అయ్యే వెంకట సత్యనారాయణ రాజు.. అలాగే అల్లూరి మనవడు లక్ష్మీపతి రాజు కూడా పాల్గొన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులు, సిపిఐ రామకృష్ణ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

48

సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ.. రాజమౌళిగారు తెలుగులో ప్రముఖ దర్శకులు. ఆయన తన స్వార్థం కోసం, డబ్బు కోసం అల్లూరి, కొమరం భీం పాత్రలని వక్రీకరిస్తూ ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. అల్లూరి, కొమరం భీం చరిత్ర గురించి అందరికి తెలుసు. వారు ప్రజల కోసం తమ జీవితాలనే త్యాగం చేసారు. అలాంటి త్యాగధనుల జీవితాల్ని వ్యాపారం కోసం వక్రీకారించడం దారుణం. 

58

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ గా పనిచేసినట్లు.. బ్రిటిష్ వారితో కలసి డాన్స్ చేసినట్లు చూపించడం దారుణమైన విషయం అని రామకృష్ణ మండిపడ్డారు. గతంలో కూడా కృష్ణగారు అల్లూరిపై సినిమా చేశారు. ఆయన చాలా అద్భుతంగా ఆ సినిమాని తీసి అల్లూరి త్యాగాలని చూపించారు. కానీ ఆర్ఆర్ఆర్ లో మాత్రం వారి చరిత్రని తెలియజేయకుండా పోలీస్ గా చూపించడం, డాన్సులు వేయించడం చరిత్రని వక్రీకరించడమే అని రామకృష్ణ అన్నారు. 

68

అసలు ఈ చిత్రంతో రాజమౌళి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి వ్యతిరేకంగా అల్లూరి కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యక్ష ఆందోళన చేస్తాం అని రామకృష్ణ హెచ్చరించారు. సెన్సార్ బోర్డు దగ్గర ఆర్ఆర్ఆర్ చిత్రంపై ధర్నా చేస్తాం అని ప్రకటించారు. 

78

అల్లూరి, కొమరం భీం ల మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని రాజమౌళి చెప్పారు. నిజమే కావచ్చు.. కానీ వారు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ గా పనిచేసినట్లు ఏ చరిత్రలోనూ లేదు. పోనీ రాజమౌళి ఎక్కడైనా చూశారా ? అని రామకృష్ణ ప్రశ్నించారు. సిపిఐ పార్లమెంట్ సభ్యులు బినయ్ విశ్వం దృష్టికి కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తీసుకువెళ్లినట్లు రామకృష్ణ అన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళతామని అన్నారు. 

88

సమకాలీకులు అయిన కొమరం భీం, అల్లూరి ఒకే సమయంలో అజ్ఞాతంలోకి వెళతారు. ఆ రెండు మూడేళ్లపాటు వారు ఎక్కడ ఉన్నారు ఏం చేసారు అనేది ఎవ్వరికి తెలియదు. ఆ సమయంలో వారిద్దరూ కలుసుకుని స్నేహితులుగా మారితే ఎలా ఉంటుంది అనే కల్పిత పాయింట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డివివి దానయ్య నిర్మాత. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. మరి సిపిఐ రామకృష్ణ ప్రశ్నలకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి. 

click me!

Recommended Stories