డైరెక్టర్ నందిని రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్ సమంత చాలా ఎమోషనల్ అవుతూ.. బర్త్ డే విషెస్ తెలిపింది. తన జీవితంలో నందిని రెడ్డి ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలియజేసింది. ఈ మేరకు నందినితో కలిసి ఉన్న ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
టాలీవుడ్ లేడీ డైనమిక్ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ నందినికి హార్ట్ ఫుల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. సీనియర్ నటి రమ్య క్రిష్ణ, ఇతర తారలు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కూడా ఎమోషనల్ అవుతూ బర్త్ డే విషెస్ తెలిపారు.
26
అయితే సమంత, నందిని రెడ్డికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. కానీ సమంత జీవితంలో నందిని రెడ్డి ఎంత ప్రాధాన్యత కలిగిన పోషించిందో తెలియజేసింది. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. ఎమోషనల్ అవుతూ నోట్ కూడా రాసింది.
36
‘పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియ మిత్రమా. నీ మంచితమే నీ గొప్పతనం. నువ్వు నాకు స్ఫూర్తినిచ్చావు. నాకింకా గుర్తుంది. అది 2012వ సంవత్సరం. అప్పుడు నేను ఎంతో ఒత్తిడిలో ఉన్నాను. నా ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇక నటించనని అనుకున్న సమయంలో నువ్వు నా పక్కనే నిలిచావు.. నా జీవితంలో కీలక పాత్ర పోషించావు. ప్రతి రోజు నన్ను కలుస్తు నాలో ధైర్యం నింపేదానివి.
46
నీ బిజీ షెడ్యూల్‌లో కూడా నా కోసం టైం కేటాయించావు. క్లిష్టపరిస్థితుల్లో నా వెన్నంటే ఉన్నావు. నా మీద నమ్మకం ఉంచినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నీకు ఫ్యూచర్ లో మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
56
నందిని రెడ్డి తన తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో రైటర్ గా, దర్శకురాలిగా మెప్పించింది. అలాగే టెలివిజన్ సిరీస్ లతోనూ తన మార్క్ చూపించింది.
66
‘అదుర్స్’కు జడ్జీగా, ‘మన ముగ్గురి లవ్ స్టోరీ’, ‘గ్యాంగ్ స్టార్స్’లకు దర్శకత్వం వహించింది. చివరిగా ‘సామ్ జామ్’ టీవీ షోకు కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు నందినిరెడ్డి. అలాగే సమంత నటించిన ‘జబర్దస్త్’, ‘హో బేబీ’ మూవీకు కూడా దర్శకత్వం వహించారు.