సమ్మర్ సినిమాలను కాటేసిన కరోనా... చిరు, బాలయ్య, వెంకీ చిత్రాల విడుదల వాయిదాతో ఆశలుగల్లంతు!

First Published Apr 24, 2021, 7:00 PM IST

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమను కరోనా సెకండ్ వేవ్ మరలా గతకాలపు దుర్భరపరిస్థితులను పరిచయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రేమికుల ఆశలపై నీళ్లు చల్లుతూ కరోనా తీవ్ర రూపం దాల్చింది. 

మరోవైపు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఆచార్య, అఖండ, నారుప్ప వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ మే నెలలో విడుదల కావాల్సి ఉంది. వీటితో పాటు మీడియం బడ్జెట్ చిత్రాలు లవ్ స్టోరీ, విరాటపర్వం చిత్రాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.
undefined
చిరు, బాలయ్య, వెంకటేష్ చిత్రాలు విడుదలతో సమ్మర్ లో సినిమా సందడి ఉంటుందని అందరూ భావించారు. దర్శక నిర్మాతలకు కరోనా ఝలక్ ఇచ్చింది. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయిన సమ్మర్ ని టాలీవుడ్ మరోసారి కోల్పోనుంది.
undefined
దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న  మల్టీస్టారర్ ఆచార్య మే 13న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఏడాది దాటిపోయింది. కొరటాల చివరి చిత్రం భరత్ అనే నేను విడుదలై రెండేళ్లు దాటిపోతుండగా ఆయన త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ తో పాటు విడుదల కూడా వాయిదాపడింది.
undefined
వరుస పరాజయాలతో కసిమీదున్న బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో చేస్తున్న అఖండ మూవీ కోసం ఫ్యాన్స్ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ టీజర్స్ సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మే 28న సింహం దిగుతుంది అనుకుంటే... కరోనా మొండికాలు అడ్డం పెట్టింది. అఖండ మూవీ సైతం విడుదల వాయిదా వేసుకున్న చిత్రాల లిస్ట్ లో ఉంది.
undefined
ఆచార్య, అఖండ చిత్రాల తరువాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న చిత్రాలలో నారప్ప ఒకటి. తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకేక్కిస్తున్నారు. నారప్ప చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. థియేటర్స్ మూసివేతతో నారప్ప విడుదల కూడా లేనట్లే.
undefined
ఇక క్రాక్ విజయంతో జోరుమీదున్న రవితేజ నెలల వ్యవధిలో ఖిలాడి చిత్రాన్ని సిద్ధం చేశారు. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 28న గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కోరల్లో చిక్కుకున్న ఈ చిత్ర విడుదల చెప్పిన తేదీకి లేనట్లే. రమేష్ వర్మకు కరోనా సోకడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.
undefined
ఇక రానా, సాయి పల్లవి కలిసి నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కాగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.
undefined
undefined
click me!