దర్శన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్ లు, కమిడియన్ సైతం ,,,

First Published Jun 18, 2024, 7:35 AM IST

 దర్శన్‌ ఆప్తుడు- సిని కమిడియన్  చిక్కణ్ణకూ తాఖీదులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 

Darshan Case - Chikkanna

 దర్శన్, పవిత్ర గౌడలు హత్య కేసులో అరెస్ట్ అవ్వటం  కన్నడ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. దర్శన్ తన అభిమానిని చంపించటం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.  పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పదే పదే వేధిస్తున్నాడంటూ అభిమాని రేణుకా స్వామి గురించి దర్శన్‌కు చెప్పి ఈ సమస్యను కొని తెచ్చుకున్నట్లు అయ్యింది. దాంతో తెరపై హీరో కాస్త.. రియల్ లైఫ్‌లో విలన్ అయ్యాడు. ఆ అభిమానిని ఎత్తుకొచ్చి.. ఆమె కళ్ల ముందే హింసించి చంపేశాడు దర్శన్. రేణుకా స్వామి ప్రైవేట్ పార్టులపై కొట్టి దర్శన్ చంపేశాడని చెప్తున్నారు. ఈ హత్య కేసులో పోలీస్ లు చాలా స్పీడుగా వ్యహరిస్తున్నారు. ఈ క్రమంలో చాలా  ట్విస్ట్ లు బయిటకు వస్తున్నాయి. తాజాగా కన్నడ కమిడయన్ ఒకరని ఈ కేసులో విచారణ  చేపట్టారు పోలీసులు. 


ఈ హత్య కేసులో డ్రైవర్ అప్రూవర్‌గా లొంగిపోవటంతో దర్యాప్తు వేగవంతం అయ్యింది.    రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈకేసులో సినీనటుడు దర్శన్‌ ఇప్పటికే పోలీస్‌ కస్టడీలో విచారణ ఎదుర్కొంటుండగా.. నటి పవిత్రాగౌడ మేనేజరు దేవరాజ్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి.

Latest Videos


హత్యకు ముందే రేణుకాస్వామి మెడలో ఉన్న బంగారు గొలుసును క్రిమినల్స్  దోచుకున్నట్లు పోలీస్ లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్టు చేయగా.. దేవరాజ్‌ను  అన్నపూణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. స్వామిని ఓ షెడ్డులో హత్య చేయగా.. పవిత్రాతో కలసి దేవరాజ్‌ అక్కడికి వెళ్లాడని గుర్తించారు. ఆ కారణంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

Darshan Comedy Star


మరో ప్రక్క దర్శన్‌ ఆప్తుడు- సిని కమిడియన్  చిక్కణ్ణకూ తాఖీదులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌నగరలో పవిత్రాగౌడ ఇంటిలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. 
 


రేణుకాస్వామి హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 8వ తేదీన నగరంలోని స్టోని బ్రూక్‌ రెస్టారెంట్‌లో దర్శన్‌తో పాటు చిక్కణ్ణ కూడా ఉన్నట్టు సమాచారం. వారితో పాటు దర్శన్‌ అనుచరులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పార్టీలో పాల్గొన్న దర్శన్‌ సాయంత్రం వేళకు అర్జెంట్‌ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పార్టీలో చిక్కణ్ణ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. 
 


బెంగళూరు ఆర్‌ఆర్‌ నగరలోని స్టోని బ్రూక్‌ పబ్‌లో సోమవారం నాడు పోలీసులు మహజర్‌ చేపట్టారు. దర్శన్‌, రెస్టారెండ్‌ యజమాని వినయ్‌, ప్రదోశ్‌, పవన్‌ ఇతర నిందితులతో పాటు కమెడియన్‌ చిక్కణ్ణను కూడా పోలీసులు తీసుకువచ్చారు. విచారణ నోటీసులు అందుకున్న చిక్కణ్ణ ఆగమేఘాలపై ఠాణాకు చేరుకుని అధికారులకు సహకరించాడు. రెస్టారెంట్లో పార్టీకి చిక్కణ్ణ హాజరు వివరాలను సేకరించారు. ఈ సమయంలో పరిసరాల్లో బందోబస్తు పెంచారు. 
 


కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్‌ అనుచరునిగా పేరున్న ధనరాజ్‌ ఆలియాస్‌ రాజ అనే మరో నిందితున్ని అరెస్టు చేశారు. రేణుకాస్వామిపై దాడి చేసిన సమయంలో దర్శన్‌తో పాటు అతడు కూడా ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ధనరాజ్‌.. పవిత్రగౌడ ఇంట్లో పనిచేసేవాడు.  
 

DARSHAN CLOSE UP


 పోలీసులు అందించిన తాజా సమాచారం ప్రకారం.. చిత్రదుర్గం నుంచి స్వామిని బెంగళూరులోని షెడ్డుకు తరలించిన వెంటనే పవిత్ర ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆ వ్యక్తిపై కోపంతో దాడికి దిగింది. క్షమించాలని కాళ్లపై పడి ప్రాధేయపడినా కనికరించకపోగా పాదరక్షతో మళ్లీ దాడిచేసింది. ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులు, పాదరక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు. నిందితులకు చెందిన పది సెల్‌ఫోన్లలో వివరాలు పరిశీలిస్తున్నారు.  అలాగే దాడి సమయంలో స్వామి మెడలోని బంగారు గొలుసును ఓ నిందితుడు చేజిక్కించుకున్నాడని మరో నిందితుడు రవి చెప్పినట్లు సమాచారం.

Darshan Pavithra Gowda Car


రేణుకాస్వామి హత్యపై కన్నడ హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సోమవారంనాడు ప్రముఖ హీరో ఉపేంద్ర ఎక్స్‌లో స్పందిస్తూ, ఈ హత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనంగా మారింది. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రమ్య, చేతన్‌, సుదీప్‌ తదితరులు ఇదివరకే స్పందిస్తూ రేణుకాస్వామి భార్యకి పుట్టబోయే బిడ్డకు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓ టీవీ నటి దర్శన్‌ చేసిన దానధర్మాలే ఆయనను కాపాడతాయని పోస్ట్‌ చేశారు.

Darshan Pavithra Gowda

 
సినిమాలు, నిజ జీవితంలో దర్జా అనుభవించే దర్శన్‌కు పోలీస్‌ ఠాణా, విచారణ చాలా కష్టంగా ఉన్నాయి. కాళ్లు పట్టుకుంటాను... నన్ను వదిలేయండి అని పోలీసులను దర్శన్‌ వేడుకుంటున్నట్టు సమాచారం. ఈ హత్య తాను చేయమని చెప్పలేదని, ఏ తప్పూ చేయలేదని ప్లీజ్‌ వదిలేయండి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలిసింది. గత వారం రోజులుగా దర్శన్‌ ఏ ప్రశ్నలు వేసినా ఇదే సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. 


  రేణుకాస్వామికి చెందిన సెల్‌ఫోన్‌ను సుమనహళ్లి వంతెన వద్ద కాలువలో పడేశారని గుర్తించారు. దాని కోసం ప్రస్తుతం శోధిస్తున్నారు. అక్కడికి సమీపంలోని సత్యఅనుగ్రహ లేఔట్‌ వద్ద ఆయన మృతదేహాన్ని పడివేశారు. ఈ వ్యవహారానికి సహకరించిన నిందితుడు వినయ్‌ను కాలువ వద్దకు తీసుకొచ్చి బెంగళూరు పాలికె పారిశుద్ధ్య కార్మికుల సాయంతో సెల్‌ఫోన్‌ కోసం సాయంత్రం వరకు గాలించినా ప్రయోజనం కనిపించలేదు.
 


 ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ టీమ్ లోని సీఐ గిరీశ్‌నాయక్‌ మొదట ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లినా.. ప్రభుత్వం మళ్లీ ఇదే టీమ్ లో సభ్యుడిగా చేర్చడం సోమవారం నాటి పరిణామం. దర్యాప్తు బృందానికి విజయనగర ఏసీపీ చందన్‌ నేతృత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం గిరీశ్‌నాయక్‌ కీలక భూమిక పోషించనున్నారు.

click me!