జాన్వీ కన్నీళ్లు.. డైరెక్టర్ క్షమాపణ..?
పెద్ది సినిమా గురించి దాని కథ కన్నా ఎక్కువగా, అందులో హీరోయిన్ జాన్వీని చూపించిన తీరుపైనే పెద్ద చర్చ జరిగింది. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్‌ను ఒక కామ దేవతలా, రొమాన్స్ కు మాత్రమే అన్నట్టుగా.. ఒక వస్తువులా చూపించారని ప్రేక్షకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ గొడవ జరుగుతుండగానే, సినిమా షూటింగ్ టైంలోనే తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని, ఈ విషయం గురించి కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని జాన్వీ తన సన్నిహితులతో పంచుకున్న చాట్స్ కూడా వైరల్ అయ్యాయి.ఇంత రచ్చ అయ్యాక, దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా జాన్వీకి, సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, ఇప్పుడు సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను కూడా తొలగించారు.