మహేష్‌ లేజీ, ఎన్టీఆర్‌ క్రేజీ.. వివాదంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య

First Published Aug 1, 2020, 3:44 PM IST

స్టార్ హీరోల ఫ్యాన్స్‌ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు అంచనా వేయలేరు. ముఖ్యంగా తమ ఫేవరెట్‌ హీరోల మీద వేసే పంచ్‌ డైలాగ్‌ల విషయంలో ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎవరూ గెస్ చేయలేరు. ముఖ్యంగా చిన్న సినిమాల్లో స్టార్ హీరోల ప్రస్తావన వచ్చినప్పుడు అనవసరంగా రచ్చ అయిన సందర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి వివాదమే ఇప్పుడు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయంలోనూ జరుగుతోంది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యదేవ్‌ హీరోగా కేరాప్‌ కంచరపాలెం ఫేం వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిజిటల్‌ రిలీజ్ అయ్యింది.
undefined
క్రేజీ కాంబినేషన్‌ కావటంతో పాటు హీరో దర్శకులు ఇద్దరి రికార్డ్ పాజిటివ్‌గా ఉండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకుతగ్గట్టుగా సినిమాకు కూడా పాజిటివ్‌ టాక్‌ రావటంతో ఓటీటీలో తొలి సూపర్‌ హిట్ సినిమాగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అవతరిస్తుందని అంతా భావించారు.
undefined
కానీ తాజాగా ఓ వివాదం ఈ చిత్ర యూనిట్ ను కలవర పెడుతోంది. ఈ సినిమాలో నయా కమెడియన్‌ సుహాస్‌ కూడా కీ రోల్‌ ప్లే చేశాడు. ఆ క్యారెక్టర్ ఓ అమ్మాయి దగ్గర మాట్లాడుతూ `మహేష్ బాబు అయితే ఉన్న చోట నుండీ కదలకుండా చంపేస్తూ ఉంటాడు- వెరీ లేజీ, అదే ఎన్టీఆర్ అనుకో వెంబడి పడి పడి నరికేస్తుంటాడు-సో క్రేజీ` అంటాడు. ఇప్పుడు ఈ డైలాగే వివాదానికి కారణమైంది.
undefined
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబును లేజీ అనటంపై ఆయన అభిమానులు వెంకటేష్‌ మహా మీద మండిపడుతున్నారు. డిజిటల్‌లో రిలీజ్ అయిన సినిమా మీద సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు ఫ్యాన్స్‌. మహేష్ బాబుతో పాటు ఆయన ఫ్యాన్స్‌కు కూడా క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
undefined
అంతేకాదు #UMURteamShouldApologizeMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్‌ ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు సూపర్‌ స్టార్ అభిమానులు. హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్‌ మహాలు వివాదాల జోలికి వెళ్లరని, ఉద్దేషపూర్వకంగా ఆ డైలాగ్‌ పెట్టి ఉండరని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
undefined
click me!