
చిరంజీవి, కాజల్ జంటగా మొదటిసారి `ఖైదీ నెంబర్ 150` చిత్రంలో నటించారు. చిరు రీఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. చిరంజీవి, కాజల్ జోడీ వెండితెరపై మెస్మరైజ్ చేసింది. చిరుకి జోడీగా బాగా సూట్ అయ్యిందీ చందమామ.
ఈ హిట్ కాంబినేషన్‌ని మరోసారి రిపీట్ చేస్తూ `ఆచార్య` చిత్రంలో కాజల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మొదట ఈ పాత్ర కోసం త్రిషని ఫైనల్ చేయగా, ఆమె ఆదిలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యింది. ఇతర ప్రాజెక్ట్ ల్లో ఆమె బిజీగా ఉండటం, పైగా చిరంజీవి సరసన అంటే హీరోయిన్ పాత్రకి అంతగా ప్రయారిటీ లేకపోవడమనే కారణాలతో ఆమె తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో కాజల్‌ని ఎంపిక చేశారు.
పెళ్లికి ముందే కొన్ని రోజులు `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొంది కాజల్. మధ్యలో సడెన్‌గా మ్యారేజ్ చేసుకుని, హనీమూన్ పూర్తయ్యాక మరోసారి చిత్రీకరణలో పాల్గొంది. తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి వచ్చి ఆమె చిరంజీవి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. వారిని చిరు కూడా సత్కరించారు. `ఆచార్య`లో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లింది.
మొదట ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ చేసిన `లాహే లాహే` పాటలో కాజల్ మెరిసింది. చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో `ఆచార్య`కి సంబంధించిన కాజల్ ఎక్కడా కనిపించలేదు. టీజర్‌లోనూ ఆమెని చూపించలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోనూ కాజల్ లేదు. పాటల్లోనూ కాజల్ నో అప్పియరెన్స్. దీంతో అటు అభిమానుల్లో, ఇటు నెటిజన్లలోనూ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. చిరంజీవికి, కాజల్‌కి మధ్య ఎక్కడైనా చెడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దీనికితోడు ఇప్పటి వరకు కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లోగానీ, ట్విట్టర్‌లోగానీ `ఆచార్య` సినిమాకి సంబంధించి ఎలాంటి పోస్టర్‌ని పంచుకోలేదు. ప్రారంభం నుంచి కూడా `ఆచార్య` ప్రచార చిత్రాలను షేర్ చేయలేదు. కానీ ఆ మధ్య రిలీజ్ అయిన `హే సినామిక` చిత్ర పోస్టర్లు, పాటలను పంచుకుంది కాజల్. దీంతో అనుమానాలకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది.
ప్రస్తుతం కాజల్ మగబిడ్డకి జన్మనిచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `ఆచార్య` చిత్రం ఈ నెల 29న విడుదలవుతుంది. తల్లి అయిన కారణంగా కాజల్ బయటకు రాలేని పరిస్థితి. దీంతో ఆమె `ఆచార్య` ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనబోదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టైమ్‌లో ఏ తల్లి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోదు.
దీనికితోడు నేడు(శనివారం) హైదరాబాద్‌లో `ఆచార్య` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి కూడా కాజల్ వచ్చే పరిస్థితి లేదు. ఇక మొత్తంగా కాజల్ లేకుండానే ఆచార్య ప్రమోషన్ చేయబోతున్నారు చిరంజీవి టీమ్. అయితే ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. కానీ ప్రధానంగా `ఆచార్య`ని తండ్రికొడుకుల చిత్రంగానే ప్రమోట్ చేస్తుంది యూనిట్.
రామ్‌చరణ్ ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకున్నారు. ఈ చిత్రంతో ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ని `ఆచార్య`కి ఉపయోగించుకునే పనిలో ఉన్నారు చిరంజీవి. అందుకే వేరే ఇంకెవరినీ ఎంకరేజ్ చేయడం లేదని టాక్.
దీనికితోడు టీజర్, ట్రైలర్స్ లోనూ తన పాత్రని చూపించకపోవడంతో కాజల్ కూడా బాగా హర్ట్ అయ్యిందట. అందుకే ఆమె `ఆచార్య` చిత్రాన్ని ప్రమోట్ చేయడం లేదని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతోగానీ, చిరుకి, కాజల్‌కి మధ్య విభేదాలు అనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.