యాంకర్ గా శ్రీముఖి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన కేరీర్ ప్రారంభంలో కాస్తా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రస్తుతం సాఫీగా సాగుతోంది. వరుస టీవీషోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అలరిస్తోంది.
28
యాంకర్ రవి (Ravi), శ్రీముఖి కలిసి వ్యాఖ్యాతగా కొన్నాళ్లపాటు కొనసాగిన కామెడీ అండ్ యూత్ ఎంటర్ టైనర్ ‘పటాస్’ షోతో శ్రీముఖికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ షోతోనే ‘బుల్లితెర రాములమ్మ’గా పేరు దక్కించుకుంది.
38
ప్రస్తుతం రియాలిటీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు సినిమాలపైనా ఫోకస్ పెడుతోంది సుందరి. కానీ తనకు ప్రాధాన్యమున్న పాత్రలు దక్కడం లేదు.
48
అయినా, శ్రీముఖి సరిగ్గా ప్రయత్నిస్తే సినిమాల్లో మంచి పాత్రలే దక్కేవంటూ ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జులాయి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, నేను శైలజా తదితర చిత్రాల్లో నటించి అలరించింది.
58
ఇటీవల మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ (Bhola Shankar) చిత్రంలోనూ ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంతోనైనా వెండితెరవైపు శ్రీముఖి అడుగులు గట్టిగా పడేనా అని పలువురు అంటున్నారు.
68
మరోవైపు ఈ బుల్లితెర యాంకర్ సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోయేలా స్టిల్స్ ఇస్తోంది. తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
78
లేటెస్ట్ పిక్స్ లో రాములమ్మ స్టైలిష్ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవ్వాల్సిందే. రెడ్ కలర్ సూట్ లో గ్లామర్ ఘాటును వెదజల్లించింది. మ్యాచింగ్ జ్యూవెల్లరీ, ఈయర్ రింగ్స్, లిప్ స్టిక్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
88
ప్రస్తుతం శ్రీముఖి ‘స రి గ మ ప’ సింగింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ షూట్ కోసం ట్రెండీ వేర్ ధరించింది. ఈ సందర్భంగా ఫొటోషూట్ లో పాల్గొని ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.