చిరంజీవి నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీతో ఓ నటుడు ఓవర్ నైట్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబు నిర్మాణంలో నటించిన చిత్రం రుద్రవీణ. ఈ చిత్రానికి దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ దర్శకత్వం వహించారు. రుద్రవీణ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఈ చిత్రం ఫ్లాప్. ఈ మూవీలో శోభన హీరోయిన్ గా నటించింది.
25
కమర్షియల్ ఫ్లాప్ గా రుద్రవీణ
రుద్రవీణ చిత్రం కమర్షియల్ మూవీ కాదు. సందేశాత్మక చిత్రం. అప్పటికి చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ కి ఇలాంటి సినిమా చేయడం అంటే సాహసమే. అయినా చిరంజీవి చేశారు. రిజల్ట్ నిరాశపరిచింది. దీనితో రుద్రవీణ తర్వాత మంచి మాస్ మూవీ చేసి హిట్ కొట్టాలని చిరంజీవి డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తన స్నేహితులకు చేయూతనివ్వాలని కూడా చిరంజీవి భావించారు.
35
స్నేహితుల నిర్మాణంలో చిరంజీవి
దీనితో రుద్రవీణ తర్వాత చిత్రాన్ని నిర్మించే బాధ్యతని చిరు తన స్నేహితుడు జివి నారాయణరావుకి అప్పగించారు. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాణంలో చిరంజీవి రూమ్ మేట్స్ నటుడు సుధాకర్, హరిప్రసాద్ లు కూడా భాగం అయ్యారు. ముగ్గురూ కలసి యముడికి మొగుడు అనే చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఈ చిత్రం విడుదలై హిట్ కావడం కాదు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.
ఈ మూవీని నిర్మిస్తూనే సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కామెడీ వేషంలో నటించారు. కోట శ్రీనివాసరావు కొడుకుగా సుధాకర్ పండించిన కామెడీ కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంతో సుధాకర్ నిర్మాతగా సక్సెస్ కావడం మాత్రమే కాదు.. ఓవర్ నైట్ లో స్టార్ కమెడియన్ గా మారిపోయారు. ఈ మూవీ తర్వతే సుధాకర్ కి కమెడియన్ గా అవకాశాలు వెల్లువెత్తాయి.
55
ఇండస్ట్రీ హిట్ గా యముడికి మొగుడు
ఈ చిత్రాన్ని నారాయణ రావు, సుధాకర్, హరిప్రసాద్ నిర్మించారు కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. బడ్జెట్ ఎక్కువ కావడంతో తన స్నేహితులకు రిస్క్ ఉండకూడదు అని చిరంజీవి అల్లు అరవింద్ దగ్గర ఈ చిత్రాన్ని కొనిపించారు. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి 5 లక్షల లాభం ముందే ఇచ్చేశారు. రిలీజ్ తర్వాత యముడికి మొగుడు చిత్రం ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు తిరగరాసింది.