రహస్య వివాహం చేసుకున్న హైపర్ ఆది... వైరల్ గా పెళ్లి ఫోటోలు!

Published : Dec 04, 2022, 12:38 PM ISTUpdated : Dec 04, 2022, 12:43 PM IST

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఆయన రహస్య వివాహం చేసుకున్నాడంటూ ప్రచారం జరుగుతుంది.   

PREV
17
రహస్య వివాహం చేసుకున్న హైపర్ ఆది... వైరల్ గా పెళ్లి ఫోటోలు!
Hyper Aadi


జబర్దస్త్ స్టార్స్ గా ఉన్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పెళ్లి మాటెత్తడం లేదు. ఇద్దరూ 30 ప్లస్ క్రాస్ చేశారు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై బిజీగా ఉన్నారు వీరిద్దరూ. ఈటీవికి సుధీర్ దూరమయ్యాక హైపర్ ఆది ప్రాధాన్యత పెరిగింది. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో దూసుకుపోతున్నాడు. 

27

హైపర్ ఆది కామెడీ పంచెస్, టైమింగ్ జోక్స్ బాగా ఫేమస్. జబర్దస్త్ స్కిట్స్ లో ఆది వేసే నాన్ స్టాప్ పంచులు మాములుగా పేలవు. శాంతి స్వరూప్, రైజింగ్ రాజుల ఫిగర్స్, గ్లామర్ ని ఉద్దేశించి హైపర్ ఆది వేసే సైటైర్లు నవ్వులు పూయిస్తాయి. వారి కాంబినేషన్లో అద్భుతమైన స్కిట్స్ రూపొందాయి. 

37

ఆ మధ్య హైపర్ ఆది కొన్నాళ్ళు జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఆది నిష్క్రమణ రేటింగ్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల ఆది రీఎంట్రీ ఇచ్చాడు. తన మార్క్ పంచులతో అలరిస్తున్నారు. ఆయన స్కిట్స్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ రాబడుతున్నాయి. 

47


ఇటీవల జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చారు. ఆమె పేరు సౌమ్య రావు. కన్నడ అమ్మాయి అయిన సౌమ్య రావుకు హైపర్ ఆది అప్పుడే చుక్కలు చూపిస్తున్నాడు. ఆమెను తన స్కిట్స్ లో భాగం చేసి కామెడీ పంచే ప్రయత్నం చేస్తున్నాడు. తన కంటే సీనియర్స్ అయిన అనసూయ, రష్మీలనే హైపర్ ఆది ఆడుకున్నాడు. ఇక సౌమ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

57
Hyper Aadi


కాగా హైపర్ ఆది పెళ్లి ఫోటోలు సడన్ గా ప్రత్యక్షమయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన పెళ్లి పీటలపై ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు కంగుతింటున్నారు. హైపర్ ఆదికి రహస్య వివాహం జరిగందంటూ ప్రచారం చేస్తున్నారు. 
 

67
Hyper Aadi


అయితే అందులో నిజం లేదని పరిశీలనలో తేలింది. ఒక సినిమా సన్నివేశంలో భాగంగా హైపర్ ఆది పెళ్లి కొడుకుగా తయారయ్యారు. ఆయనపై పెళ్లి సీన్ చిత్రీకరించారు. ఆ ఫోటోలు వైరల్ చేస్తూ కొందరు హైపర్ ఆదికి పెళ్లి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. హైపర్ ఆదితో పాటు ఉన్న ఆ పెళ్లి కూతురు సీరియల్ యాక్టర్ అని సమాచారం. గతంలో కూడా ఫోటోలు బయటకి తీసి హైపర్ ఆదికి పెళ్లి జరిగిందని ప్రచారం చేశారు. 
 

77


గతంలో హైపర్ ఆది తన పెళ్లిపై కామెంట్స్ చేశాడు. సుధీర్, ప్రదీప్ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా అంటూ శబధం చేశాడు. తనకంటే వయసులో పెద్దవాళ్ళైన ఆ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కాకే నేను ఎక్కుతా అన్నారు. హైపర్ ఆది ప్రస్తుత వయసు 32 ఏళ్ళు. 

click me!

Recommended Stories