లగ్జరీ కార్లు, ఇళ్లు, పొలాలు... బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే మతిపోతుంది!

First Published Feb 1, 2024, 5:03 PM IST

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. దశాబ్దాల పాటు ఆయన ప్రస్థానం కొనసాగింది. ఇక బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. స్టార్ హీరోలకు మించి ఆయన కూడబెట్టారు. 
 

వెండితెరపై హాస్యానికి చిరునామా బ్రహ్మానందం. నవ్వుకు నిలువెత్తు రూపం. బ్రహ్మానందం నవ్వినా, ఏడ్చినా, కోప్పడినా, కవ్వించినా... ఏం చేసినా కామెడీనే. వందల దర్శకులు వేల పాత్రలు ఆయన కోసం రాశారు. తరగని నవ్వుల గని బ్రహ్మానందం చేసిన పాత్రలు. 

బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి. వృత్తిరీత్యా లెక్చరర్ అయిన బ్రహ్మానందం థియేటర్, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడాను. అలాగే రచయిత, చిత్రకారుడు. చిరంజీవి సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లిన బ్రహ్మానందం విచిత్రమైన ముఖ కవళికలతో చిరంజీవిని చూస్తూ ఆయన కంట్లో పడ్డాడు. 

Latest Videos


జంధ్యాల బ్రహ్మానందం కి వెండితెరకు పరిచయం చేశాడు. చిరంజీవితో చేసిన కామెడీ చిత్రం చంటబ్బాయి మూవీలో చిన్న పాత్ర చేశాడు. 1987లో విడుదలైన అహ నా పెళ్ళంట మూవీతో బ్రహ్మానందం వెలుగులోకి వచ్చాడు. జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో పిసినారి కోటా శ్రీనివాసరావు ఇంట్లో పనివాడిగా బ్రహ్మానందం చేసిన పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. 

అక్కడి నుండి బ్రహ్మానందం వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తప్పనిసరి. కేవలం బ్రహ్మానందం కారణంగానే ఆడిన సినిమాలు వందలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా ఈ మధ్య ఆయన జోరు తగ్గింది. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. 
 

చదువుకునే రోజుల్లో బ్రహ్మానందం గుంటూరు నల్లపాడు వద్ద లారీలకు పెయింట్ వేసేవాడట. అలా వచ్చిన ఒకటి రెండు రూపాయలు ఖర్చులకు వాడుకునేవాడట. దాతల సహాయంతో చదువు పూర్తి చేసిన బ్రహ్మానందం ఇప్పుడు వందల కోట్లకు అధిపతి. 

బ్రహ్మానందం కటిక పేదరికం అనుభవించాడు. రూపాయి విలువ బాగా తెలుసు. అందుకే కోట్ల సంపాదన ఉన్నా డబ్బులు విషయంలో నిక్కచ్చిగా ఉంటాడు. ఎడాపెడా ఖర్చు చేయడు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్  ఆయన. 


బ్రహ్మానందం తన ఆస్తిని రియల్ ఎస్టేట్ లో పెట్టాడు. ఆయన వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పలు ఏరియాల్లో కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయి. బ్రహ్మానందం కి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి హీరోగా ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటున్నాడు. 

బ్రహ్మానందం వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆడీ క్యూ 7, ఆడీ క్యూ 8, బెంజ్ కారు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో లగ్జరీ హౌస్ ఉంది. ఒక అంచనా ప్రకారం బ్రహ్మానందం మొత్తం ఆస్తుల విలువ రూ. 500 కోట్లు. చిన్నబ్బాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల చిన్న కొడుక్కి కూడా పెళ్లి చేశాడు. 

నేడు బ్రహ్మానందం బర్త్ డే. 1956 ఫిబ్రవరి 1న సత్తెనపల్లిలో జన్మించిన బ్రహ్మానందం 68వ  ఏట అడుగుపెట్టారు. అభిమానులు, చిత్ర  ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

click me!