Published : Jan 17, 2024, 09:50 AM ISTUpdated : Jan 17, 2024, 09:51 AM IST
జబర్దస్త్ కమెడియన్ బాబు.. జబర్దస్త్ వర్ష బట్టలపై బోల్డ్ కామెంట్ చేశాడు. నాకు బట్టలు లేవు, నీకు లేవంటూ అందరి ముందు మాట్లాడి బాంబ్ పేల్చాడు. ఇప్పుడు ఇది రచ్చ అవుతుంది.
జబర్దస్త్ కామెడీ షోలో వర్ష, ఇమ్మాన్యుయెల్ కలిసి అనేక స్కిట్లు ప్రదర్శించారు. ఇద్దరు లవర్స్ గానూ చెలామణి అయ్యారు. అనేక రూమర్స్ ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు లవ్ ప్రపోజల్‌తోపాటు రింగులు కూడా తొడుక్కున్నారు. కానీ ఇటీవల వీళ్లిద్దరు వేర్వేరుగా స్కిట్లు చేస్తున్నారు. కానీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలిమెంట్లు నడుస్తూనే ఉన్నాయి.
26
photo credit-extra jabardasth show promo
ప్రస్తుతం బాబు, ఇమ్మాన్యుయెల్, వర్షలు కలిసి స్కిట్లు చేస్తున్నారు. తమదైన కామెడీతో మెప్పిస్తున్నారు. తాజాగా వీరి మధ్య కామెడీ స్కిట్ మిస్ ఫైర్ అయ్యింది. వర్షపై బాబు చేసిన కామెంట్ కి ఆమెతోపాటు అంతా షాక్ అయ్యారు. వర్ష బట్టలపై ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు చూస్తే..
36
photo credit-extra jabardasth show promo
ఇమ్మాన్యుయెల్, వర్ష, బాబు కలిసి `గజిని` సినిమా స్కిట్ చేశాడు. ఇందులో బాబు గజినీగా మారాడు. ఫోటోలు పట్టుకుని తిరుగుతూ చివరికి వర్ష, ఇమ్మూల వద్దకు వచ్చాడు. దీంతో గతం గుర్తు చేశాడు ఇమ్మాన్యుయెల్. అరే నీ ఫస్ట్ లవ్ వర్ష రా అని చెప్పగా, బాబుకి గుర్తు వచ్చింది. దీనికి బాబు రియాక్ట్ అవుతూ.. నువ్వు లేన నేను పిచ్చోడిని అయ్యాను. మరి నువ్వు కూడా పిచ్చిదానివి అయ్యావా? అని ప్రశ్నించాడు.
46
photo credit-extra jabardasth show promo
దీనికి వర్ష స్పందిస్తూ, లేదే అని చెప్పింది. మరి నేను బట్టలు లేకుండా తిరుగుతున్న, నువ్వు కూడా బట్టలు లేకుండా తిరుగుతున్నావ్ అంటూ బోల్డ్ కామెంట్ చేశాడు. నిజానికి ఆ డైలాగ్‌కి ఆమె మైండ్ బ్లాక్ అయ్యింది. కానీ కవర్ చేసుకుంది. ఇందులో కల్పించుకుని అదిప్పుడు ఫ్యాషన్ అని చెబుతూ కవర్ చేశాడు.
56
photo credit-extra jabardasth show promo
ఈ సందర్భంగా స్కూల్ రోజుల్లో చేసిన ఎదవ పని గురించి చెప్పాడు బాబు. `నీకు గుర్తుందా వర్ష.. మనం స్కూల్లో అందరు వెళ్లిపోయాక డోర్లు వేసుకుని మనం ఇద్దరే ఉన్నాం అని అనగా, అరే ఏం చేశార్రా అని ఇమ్మాన్యుయెల్ ఆందోళనతో అడిగాడు. మర్చిపోయాను, ఎందుకంటే నేను గజిని కదా గుర్తులేదు అంటూ కవర్ చేశాడు. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది.
66
photo credit-extra jabardasth show promo
యాంకర్ రష్మి గౌతమ్, ఖుష్బూ, కృష్ణభగవాన్ నవ్వులు చిందించారు. తాజాగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇది జనవరి 19న ప్రసారం కానుంది.