సల్మాన్‌ కి పూజా కూతురులాంటిది.. కండల వీరుడితో ఎఫైర్స్ పై క్లారిటీ.. పవన్‌ విషయంలో కమిటెడ్‌గానే ఉందట..

First Published Dec 13, 2022, 9:39 PM IST

స్టార్‌ బ్యూటీ పూజా హెగ్డే రూట్‌ మార్చింది. గ్లామర్‌ రోల్స్ కే పరిమితం కాదు, నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు కూడా చేస్తుంది. ఓ వైపు అందాల విందు, మరోవైపు బలమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. 

పూజా హెగ్డే శారీలో మెరిసింది. మరీ బోల్డ్ షోకి పోకుండా కాస్త పద్ధతిగా కనిపిస్తున్న పూజా హెగ్డే తాజాగా ఎల్లో శారీలో హోయలు పోయింది. `సర్కస్‌` సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూజా ఇలా ఎల్లో శారీలో మెరిసింది. బ్యాక్‌ అందాలతో కవ్విస్తుంది. చిలిపి నవ్వులతో కట్టిపడేస్తుందీ డస్కీ బ్యూటీ. 
 

మరోవైపు పూజా హెగ్డే విషయంలో రెండు విషయాలపై క్లారిటీ వచ్చింది. ఒకటి సల్మాన్‌ ఖాన్‌తో ఎఫైర్స్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దానిపై సల్మాన్‌ ఫ్రెండ్‌ ఒకరు వివరణ ఇచ్చారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయడం విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. 
 

సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్‌ కూడా ఓ పాటలో మెరవబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగిందని, ఇద్దరు ఇప్పుడు సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నారని అటు బాలీవుడ్‌,ఇటు టాలీవుడ్‌లోనూ వార్తలు గుప్పుమన్నాయి. 

తాజాగా దీనిపై సల్మాన్‌ స్నేహితుడు క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలను ఖండించారు. ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుపడాలన్నారు. సల్మాన్‌కి, పూజా కూతురు లాంటిదన్నారు. వాళ్లిద్దరు కలిసి సినిమాల్లో నటిస్తే రూమర్లు వ్యాప్తి చేస్తారా అంటూ ప్రశ్నించారు. కొంత మంది మూర్ఖులు పబ్లిసిటీ వస్తుందని ఇలా చేస్తున్నారమే, కానీ ఇది చాలా ఇబ్బంది కలిగించే అంశమన్నారు. 

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయడంపై ఓ క్లారిటీ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ప్రారంభమైంది. షూటింగ్‌ కూడా వెంటనే స్టార్ట్ చేశారు. అయితే ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే చేస్తుందని గతంలోనే వార్తలొచ్చాయి. పవన్‌ సినిమా ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు పూజా షూటింగ్‌లో పాల్గొంటుందన్నారు. 

అయితే ఆ విషయం చెప్పి చాలా రోజులవుతుంది. ఈ లోపు చాలా లెక్కలు మారిపోయాయి. పూజాకి కొత్త ప్రాజెక్ట్ లు వచ్చాయి. ఓ వైపు హిందీతో రెండు సినిమాలు, తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేస్తుంది. తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఈ నేపథ్యంలో డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా? లేదా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె టీమ్‌ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో పూజా చేస్తుందని, ప్రస్తుతానికైనా పవన్‌ సినిమా విషయంలో పూజా కమిటెడ్‌గానే ఉందని అంటున్నారు. 
 

ఇదిలా ఉంటే పూజా.. దర్శకుడు హరీష్‌ శంకర్‌కి లక్కీ ఛార్మ్. వీరిది హిట్‌ కాంబినేషన్‌ కూడా. బన్నీతో చేసిన `డీజే`లో పూజా హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా మంచి వసూళ్లని రాబట్టింది. మరోవైపు వరుణ్‌ తేజ్‌తో చేసిన `గద్దలకొండ గణేష్‌` సైతం మంచి ఆదరణ పొందింది. దీంతో పూజాని హరీష్‌ ఓ సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అందుకే పవన్‌ సినిమాలోనూ రిపీట్‌ చేయాలని భావించారు. ఆమె డేట్స్ కూడా ఇచ్చింది. ఆలస్యం కావడంతోనే సందేహాలు మొదలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె పవన్‌ సినిమా చేసేందుకు సిద్ధంగానే ఉందని టాక్. 

ప్రస్తుతం పూజా హిందీలో చేసిన `సర్కస్‌` చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా నటించగా, జాక్వెలిన్‌ మరో హీరోయిన్‌గా నటించింది. పీరియడ్‌ కామెడీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. 
 

click me!