జూ.ఆర్టిస్ట్ గా తిండిలేని రోజులు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్‌ మాస్టర్‌

Published : Apr 22, 2021, 04:46 PM IST

`రాములో రాముల` పాటతోపాటు దానికి అద్భుతమైన డాన్సులు కంపోజ్‌ చేసిన శేఖర్‌ మాస్టార్‌ కూడా పాపులర్‌ అయ్యారు. తాజాగా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. జూ.ఆర్టిస్టుగా ఉన్నప్పుడు తిండి కోసం కొట్టుకున్న రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.

PREV
19
జూ.ఆర్టిస్ట్ గా తిండిలేని రోజులు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్‌ మాస్టర్‌
శేఖర్‌ మాస్టర్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్‌. యూత్‌ మెచ్చిన డాన్స్ కంపోజర్‌. తనదైన డాన్సులతో స్టార్లతోపాటు, మాస్‌ ఆడియెన్స్‌ ని కూడా స్టెప్పులేయించడం ఆయన స్టయిల్‌. ఆయన ప్రత్యేకత. తాజాగా శేఖర్‌ మాస్టర్‌ షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

29
ప్రస్తుతం ఆయన `స్టార్‌మా`లో కామెడీ స్టార్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. నటి శ్రీదేవితోపాటు ఆయన జడ్జ్ గా చేస్తున్నారు. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే షో ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ షోలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు.

39
ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` ప్రోగ్రామ్‌కి వర్షిణి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, శేఖర్‌ మాస్టర్‌, శ్రీదేవి జడ్జ్ లుగా ఉన్నారు. అయితే ఈసందర్భంగా `బిగ్‌బాస్‌`4 అవినాష్‌ వేసిన స్కిట్‌ ఆద్యంతం గుండెల్ని పిండేసింది. చిత్ర పరిశ్రమలో జూ.ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయనేది కళ్లకి కట్టినట్టు చూపించాడు అవినాష్‌టీమ్‌.

49
దీంతో ఆ స్కిట్‌ చూసిన శేఖర్‌ మాస్టర్‌ తన స్పందనని తెలియజేస్తూ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాదే అదే చూపించారని చెప్పారు.

59
భావోద్వేగంతో గద్గద స్వరంతో ఆయన మాట్లాడలేకపోయారు. సినిమా పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చానని, కొన్నాళ్లపాటు జూ ఆర్టిస్టుగా చేశానని చెప్పారు. అప్పుడు తినడానికి తిండి కూడా లేదని, ఎవరూ తెలియదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్‌ల్లో తిండి కోసం ఎగబడేవాళ్లమని, అది చాలా దుర్భరమైన పరిస్థితి అని వెల్లడించారు.

69
తినడానికి తిండి లేదు, జూ. ఆర్టిస్టుగా చేస్తే 75రూపాయలు ఇచ్చారని, అది చూసి ఎంతో సంతోషించానని చెప్పారు. తాను ఏం మాట్లాడలేకపోతున్నానని ఎమోషనల్‌ అయ్యారు. దీంతో అక్కడున్న కంటిస్టెంట్లు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. యాంకర్‌గా వ్యవహరిస్తున్న వర్షిణి సైతం భోరున విలపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తుంది.

79
విజయవాడకు చెందిన శేఖర్‌ మాస్టర్‌ జూ. ఆర్టిస్ట్ గా కెరీర్‌ని స్టార్‌ చేశాడు. విజయవాడలో ఓ క్రాష్‌ కోర్స్ చేసిన ఆయన కొన్ని రోజుల తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్‌గా మెంబర్‌షిప్‌ పొందారు. బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్‌గా ఆరేళ్లు చేశాడు. ఆ తర్వాత రాకేష్‌ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. మొత్తంగా ఎనిమిదేళ్లు అసిస్టెంట్ గా చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

89
సినిమాల్లోకి రాకముందు ఆయన `ఢీ2` డాన్స్ షోకి కొరియోగ్రాఫర్‌ గా చేశాడు. అది సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. `ఢీ` షోకి మొదట కొరియోగ్రాఫర్‌గా చేసి, ఆ తర్వాత జడ్జ్ అయ్యారు. ఆరు ఢీ సీజన్స్ కి జడ్జ్ గా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఇటీవలే `స్టార్‌మా`కి షిఫ్ట్ అయ్యారు.

99
కొరియోగ్రాఫర్‌గా, నాని, నాగచైతన్య నుంచి నాగార్జున, వెంకటేష్‌, చిరంజీవి వరకు దాదాపు అందరు స్టార్‌ హీరోలతో పనిచేశారు. ఇప్పుడు వస్తోన్న స్టార్‌ హీరోల సినిమాల్లో ఏదో ఒక పాటకి ఆయన కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఓ వైపు టీవీ, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా రాణిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories