మెగాస్టార్‌ మళ్లీ నిలబడాలంటే ఆ ఒక్కడు దిగి రావాల్సిందే.. `మెగా` కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్‌?

Published : May 03, 2022, 08:00 PM ISTUpdated : May 03, 2022, 08:02 PM IST

మెగాస్టార్‌ చిరంజీవికి అర్జెంట్‌గా సాలిడ్‌ హిట్‌ కావాలి. మిగిలిన హీరోల సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లో దుమ్ము రేపుతుండగా, చిరంజీవి సినిమాలు ఆశించిన రిజల్ట్ సాధించడం లేదు. దీంతో హిట్‌ కోసం మళ్లీ ఆ ఒక్కడు రావాల్సిందేనా? అనే చర్చ మొదలైంది. 

PREV
17
మెగాస్టార్‌ మళ్లీ నిలబడాలంటే ఆ ఒక్కడు దిగి రావాల్సిందే.. `మెగా` కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్‌?

చిరంజీవి(Chiranjeevi) దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత `ఖైదీ నెం.150`(Khaidi number 150) చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. బ్లాక్‌ బస్టర్‌ సాధించాడు. ఈ చిత్రం దాదాపు రూ.150కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాల టాక్‌. చిరంజీవి కమ్‌ బ్యాక్‌ మూవీ కావడంతో ఆయన అభిమానులు ఇరగబడి చూశారు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `కత్తి`కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌ అంశాలతో మంచి సందేశాన్ని ఇస్తూ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. 

27

ఆ తర్వాత చిరంజీవి `సైరా`(Syra)తో ప్రయోగం చేశారు. ఫస్ట్ టైమ్‌ హిస్టారికల్‌ స్టోరీలో నటించారు. ఈ కాస్ట్యూమ్‌ బేస్డ్ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది కానీ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ తెచ్చుకోలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి బంపర్‌ హిట్‌ కొట్టాలని కొరటాల శివని ఎంచుకున్నారు. `ఆచార్య`(Acharya) చిత్రంలో నటించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) ఇమేజ్‌ని వాడుకోవాలని రామ్‌చరణ్‌ని కూడా పెట్టారు. కానీ ఈ సినిమా బాగా డిజప్పాయింట్‌ చేసింది. ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న `ఆచార్య` నిరాశ పర్చడం మెగా అభిమానులకు కోలుకోలేని దెబ్బలా మారిపోయింది. 

37

నెక్ట్స్ చిరంజీవి లైన్‌లో ఉన్న సినిమాలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. వీటిలో రెండు రీమేక్‌లే ఉన్నాయి. మలయాళంలో హిట్‌ అయిన `లూసీఫర్‌`ని `గాడ్‌ ఫాదర్‌`(God Father) గా రీమేక్‌ చేస్తున్నారు. అయితే ఈ మాతృక సినిమాని ఇప్పటికే జనాలంతా ఓటీటీలో చూసేశారు. తెలుగులోనూ ఈ సినిమా ఉండటంతో ఆల్మోస్ట్ అంతా చూసేశారు. దీంతో చిరంజీవి చేస్తున్న రీమేక్‌ `గాడ్‌ఫాదర్‌`పై అంతగా హోప్స్ కనిపించడం లేదు. అంచనాలను పెంచేందుకు సల్మాన్‌ ఖాన్‌ని దించారు. మరి ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి.

47

ఆ తర్వాత మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తోన్న `భోళాశంకర్‌`(Bhola Shankar).. `వేదాళం`చిత్రానికి రీమేక్‌. ఈ సినిమాకి కూడా ప్రారంభం నుంచి బజ్‌ లేదు. పైగా పరాజయాల దర్శకుడు మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌ చేస్తుండటంతో ఉన్న కాస్త అంచనాలు కూడా ఆవిరైపోయినట్టే అని ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నట్టు టాక్‌. ఇందులో కీర్తిసురేష్‌ చెల్లిగా నటిస్తుండగా, తమన్నా హీరోయిన్‌గా చేస్తుంది. `వేదాళం` కూడా తెలుగులో డబ్‌ కావడంతో ఇక్కడి ఆడియెన్స్ చూశారు. దీంతో సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి బజ్‌ లేదు.
 

57

మరోవైపు బాబీతో `మెగా154` (Mega 154)చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి. బాబీతో సినిమా బాగానే ఉంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్‌ అనుకుంటున్నారట. మరి ఈ సినిమా ఏ మేరకు మెగా అభిమానులను అలరిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. బాబీతో సినిమా హిట్‌ కొట్టేంత వరకు చెప్పలేమనే భావనతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమా ప్రారంభానికి చాలా టైమ్ ఉంది.

67

ఇదిలా ఉంటే మెగా అభిమానులు మాత్రం మరోసారి `మెగా` హిట్‌ కాంబినేషన్‌ని కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ బ్యానర్‌గా పాపులర్‌ అయ్యింది గీతా ఆర్ట్స్. అల్లు అరవింద్‌ (Allu Arvind) నిర్మాతగా రన్‌ అవుతున్న ఈ బ్యానర్‌లో చిరంజీవి సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారట. ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్‌ కాంబినేషన్‌లో `హీరో`, `విజేత`, `ఆరాధన`, `పసివాడి ప్రాణం`, `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు`, `మెకానిక్‌ అల్లుడు`, `అందరివాడు` వంటి చిత్రాలొచ్చాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా రాక దాదాపు 17ఏళ్లు అవుతుండడంతో అభిమానులు వీరి కాంబినేషన్‌లో సినిమాని ఆశిస్తున్నారు. 
 

77

అల్లు అరవింద్‌ నిర్మాతగా సినిమా అంటే అది కచ్చితంగా హిట్టే అనే టాక్‌ ఉంది. ఎందుకంటే అరవింద్‌కి సినిమాలపై మంచి పట్టుంది. ఏ సినిమా హిట్టు అవుతుందో, ఏదీ పోతుందో ముందే చెప్పగలరు. సినిమాలని తన నలభై ఏళ్ల కెరీర్‌లో ఎంతో అవపోసన పట్టారు. అందుకే చిరంజీవికి మంచి హిట్‌ రావాలంటే, మళ్లీ ఆయన టాలీవుడ్‌లో తిరుగులేని మెగాస్టార్‌గా నిలబడాలంటే అల్లు అరవింద్‌ రావాల్సిందే అని, చిరుతో సినిమా చేయాల్సిందే అని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు సెట్‌ అవుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories