యాంకర్ చేసిన పొరపాటుకు మెగాస్టార్ ఆగ్రహం, షో మధ్యలో వెళ్లిపోయిన చిరంజీవి...?

First Published | Jun 12, 2022, 3:31 PM IST

మెగాస్టార్ చిరంజీవికి కోపం వచ్చింది. అవును ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే చిరంజీవి చిరాకుతో ఓ షో నుంచి వెళ్లిపోయారట. అది కూడా యాంకర్ చేసిన పొరపాుట వల్ల. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే ఎన్నో అంచనాల నడుమ.. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆచార్య సినిమా అనుకున్నంతలో కొంత కూడా  ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి... వరుసగా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 

కొరటాల శివ దర్శకత్వంలో మెగా తండ్రీ కొడుకులు చిరు,చరణ్ లు కలిసి నటించిన ఆచార్య  ఫలితం ఇబ్బంది పెట్టడంతో.. రిలాక్స్ అవ్వడం కోసం మెగాస్టార్ ఫారెన్ వెళ్ళారు.  మెగాస్టార్ చిరంజీవి తాను ముందే ప్లాన్ చేసుకున్న వెకేషన్ కు వెళ్లిపోయారు. తన భార్య సురేఖ తో కలిసి సుమారు నెల రోజుల పాటు ఆయన విదేశాల్లో  గడిపారు. ఈ మధ్యనే ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
 


మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఆచార్య ఫలితంతో  మెగాస్టార్ ఆలోచనలో పడ్డారు. ఫారెన్  లో రీ ఫ్రెష్ అయిన  చిరంజీవి నెక్ట్స్ సినిమాల షూటింగ్స్ రీ స్టార్ట్ం చేయబోతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ జూన్ 21వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది.
 

ఇక రీసెంట్ గా చిరంజీవి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి కోపం వచ్చి  ఒక షో షూటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ ఒక షోకి చీఫ్ గెస్ట్ గా వెళ్లారని .. అక్కడ షూటింగ్ టైమ్ లో యాంకర్ చేసిన ఒక పొరపాటు వల్ల మెగాస్టార్ కు కోపం వచ్చినట్టు తెలుస్తోంది. 

షో షూటింగ్ జరుగుతున్న సమయంలో షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి  స్పాన్సర్ విషయంలో ఒక పేరు తప్పుగా పలికారని, దీంతో మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రీటేక్ చేయమని కోరగా.. ఈ విషయంలో కాస్త హర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే షో నుంచి వాకౌట్ చేశారని ఫిలింనగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే ఆ షో ఏంటి అనే విషయం మీద ఇప్పటివరకు  క్లారిటీ లేదు. కానీ దాని పేరు గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఈ వ్యవహారం మాత్రం బయటకు రాలేదు. చిరంజీవిలాంటి టాలీవుడ్ టాప్ స్టార్ ను ప్రోగ్రామ్ కు పిలిచినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక యాంకర్ వల్ల షో డిస్ట్రబ్ అవ్వడంతో టీమ్ అయోమయంలో పడిపోయినట్టు సమాచారం. 

మెగాస్టార్ చిరంజీవి  ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. ఆయన హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఛలో,భీష్మఫేమ్ వెంకీకుడుములతో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు చిరంజీవి. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Latest Videos

click me!