90లలో యంగ్ విలన్ రోల్స్ కి రాజా రవీంద్ర చాలా ఫేమస్. స్టార్ హీరోల తమ్ముడిగా పాజిటివ్ రోల్స్ కూడా చేశారాయన. గతంతో పోల్చుకుంటే రాజారవీంద్ర అంత యాక్టివ్ గా లేరు. ఆయన అడపాదడపా రోల్స్ చేస్తున్నారు.
కాగా ఈ సీనియర్ నటుడు తాజా ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచార్య (Acharya) సెట్స్ లో చిరంజీవి తిట్టారంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. నాకు నోటి దూల ఉంది. దాని వలన అనేక మందితో తిట్లు తిన్నాను. రీసెంట్ గా ఆచార్య సెట్స్ లో చిరంజీవి కూడా తిట్టారంటూ... రాజా రవీంద్ర వెల్లడించారు.
25
Chiranjeevi - Rajaravindra
మరి చిరంజీవి లాంటి మిస్టర్ కూల్ రాజారవీంద్ర(Raja Ravindra)ను తిట్టడానికి కారణం ఏమిటో ఆయన తెలిజేశారు. ''అన్నయ్య నాకెంతో క్లోజ్.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను. ఆచార్య షూటింగ్లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తున్నాను. దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను... ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుంది అని చెప్పాను. దానికాయన కర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది.. కానీ నాకు బాగుంటుంది'' అని అన్నారు
35
Chiranjeevi - Rajaravindra
ఇంకా చిరంజీవి (Chiranjeevi)గురించి మాట్లాడుతూ... ''అన్నయ్యకు పరిణితి ఎక్కువ. మనం ఉద్దేశపూర్వకంగా అన్నామా? కామెడీ చేశామా? అనేది ఈజీగా గ్రహిస్తారు. దాన్ని బట్టి ఆయన స్పందిస్తారు. ఈ వయసులో అన్నయ్య నాలుగు చిత్రాలకు పని చేస్తున్నారు. ఒక హీరోగా ఆయన డాన్స్ లు, ఫైట్స్ చేయాల్సి ఉంటుంది. చిరంజీవి అన్నయ్య ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు'' అంటూ రాజారవీంద్ర పొగడ్తలతో ముంచెత్తారు.
45
Chiranjeevi - Rajaravindra
కాగా గతంలో నటుడు రాజీవ్ కనకాల కూడా రాజారవీంద్రను తిట్టాడట. మెడ నొప్పి కారణంగా బ్యాండ్ ధరించి ఉన్న ఆయన్ను చూసి రాజారవీంద్ర.. ''ఏంటీ హెడ్ వెయిట్ పెరిగింది?'' అన్నాడట. మనిద్దరికీ అంత చనువుకు కూడా లేదు, అంత మాటంటావా నన్ను? అంటూ కొట్టినంత పని చేశాడట. తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని రాజా రవీంద్ర వెల్లడించారు.
55
chiranjeevi
ప్రస్తుతం రాజారవీంద్ర యంగ్ హీరో రాజ్ తరుణ్ వద్ద మేనేజర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. గతంలో సునీల్ కి కూడా ఆయన మేనేజర్ గా వర్క్ చేశారు.