అయోధ్యలో చిరంజీవి, రామ్‌ చరణ్‌ హంగామా.. అభిమానులతో మీట్‌ గ్రీట్‌..

Published : Jan 21, 2024, 10:38 PM IST

అయోధ్య టెంపుల్‌ ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే ఉంది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ సందడి చేశారు. అభిమానులను కలిసి హంగామా చేశారు.   

PREV
15
అయోధ్యలో చిరంజీవి, రామ్‌ చరణ్‌ హంగామా.. అభిమానులతో మీట్‌ గ్రీట్‌..

అయోధ్యలో రాముడి టెంపుల్‌ నిర్మాణం భారతీయుల కల. ఆ డ్రీమ్‌ని సాధ్యమైంది. దీన్ని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాండ్‌గా రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. రేపు(సోమవారం) ఘనంగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకని ప్రత్యక్షంగా తిలకించేందుకు అయోధ్య వెళ్లారు చిరంజీవి, రామ్‌చరణ్‌. 
 

25

ఒక్కరోజు ముందుగానే అయోధ్య చేరుకున్నారు చిరంజీవి, రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా ఈ ఇద్దరు అభిమానులను కలిశారు. తమని చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో వాళ్లు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపారు. 
 

35

చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇద్దరు బయటకు వచ్చి ఫ్యాన్స్ కి అభివాదం తెలియజేయడంతోపాటు వారితో కాసేపు గడిపారు. వారి అభిమానికి ముగ్దులయ్యారు. వారితో కాసేపు ఉండి అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

45

అయోధ్య రామ మందిరం రేపు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారీగా ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌తోపాటు ప్రభాస్‌, పవన్‌ వంటి వారు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. 
 

55

ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. మైథలాజికల్‌ అంశాలతో తెరకెక్కుతుంది. మరోవైపు రామ్‌చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories