Bhagyaraj : రెండు రోజుల క్రితమే కలిశాం, జోకులేసుకున్నాం.. భాగ్యరాజ్ మరణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

Published : Jun 27, 2026, 03:04 PM IST

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ మృతి వార్త సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ లో స్పందించారు.  

PREV
14
భాగ్యరాజ్ మరణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ మరణంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. భాగ్యరాజ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వార్త విన్న తర్వాత తన గుండె ఆవేదనతో నిండిపోయిందని, తన బాధను మాటల్లో వర్ణించలేనని ఆయన ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో  స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

24
మనసు కలిచివేస్తుందన్న మెగాస్టార్

చిరంజీవి తన పోస్ట్ లో రీసెంట్ గా జరిగిన విషయాలు కూడా వెల్లడించారు. “నిన్న కాక మొన్న కూడా గోవాలో కుష్ (కుష్బూ) కుటుంబ వివాహ వేడుకలో భాగ్యరాజ్‌గారిని కలిశాను.. అందరం కకలిసి నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఫొటోలు తీసుకున్నాం. ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన మరణ వార్త విని నమ్మలేకపోతున్నాను. భాగ్యరాజ్ ఒక గొప్ప దర్శకుడు, అసాధారణ స్క్రీన్‌ప్లే రచయిత, నటుడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది” అని అన్నారు.

34
భాగ్యరాజ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

భాగ్యరాజ్ వ్యక్తిత్వం, సినీ ప్రస్థానాన్ని కొనియాడారు మెగాస్టార్. అలాగే భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన భార్య పూర్ణిమ, కొడుకు, కూతురికి ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భాగ్యరాజ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తన సంతాప సందేశాన్ని ముగించారు.

44
సంతాపం ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు..

భాగ్యరాజ్ మృతి వార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ రంగంలో దర్శకుడిగా, కథా రచయితగా, నటుడిగా భాగ్యరాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు గుర్తు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories