నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చిరంజీవి పాతాళ భైరవి?.. `కల్కి` హిట్‌తో వైరల్‌గా మారిన వీడియో..

Published : Jul 02, 2024, 05:01 PM IST

`కల్కి 2898 ఏడీ` చిత్రంతో దుమ్ములేపుతున్నాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. కానీ ఇప్పుడు చిరంజీవి హీరోగా తన దర్శకత్వంలో `పాతాళ భైరవి` లాంటి సినిమా అనే వార్తహాట్‌ టాపిక్‌గా మారింది.   

PREV
15
నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చిరంజీవి పాతాళ భైరవి?.. `కల్కి` హిట్‌తో వైరల్‌గా మారిన వీడియో..

నాగ్‌ అశ్విన్‌ ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, అట్లీ, సిద్ధార్థ్‌ ఆనంద్‌, సందీప్‌ రెడ్డి వంగా వంటి టాప్‌ కలెక్టెడ్‌ డైరెక్టర్‌ కేటగిరిలో చేరిపోతారు. ఆయన రూపొందించిన `కల్కి 2898ఏడీ` ఇప్పటికే బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా సుమారు ఆరు వందల కోట్ల గ్రాస్‌ సాధించడం విశేషం. సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయో అనే డౌట్‌ ఉండేది. కానీ ట్రేడ్‌ రిపోర్ట్ ప్రకారం బెటర్‌ కలెక్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఈ లెక్కన ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు దాటుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

25

ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిరంజీవితో సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వలో చిరంజీవి సినిమా ఉండబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా అనే టాక్‌ ప్రారంభమైంది. 
 

35

 చిరంజీవి.. గతంలో `మహానటి` సినిమా టైమ్‌లో నాగ్‌ అశ్విన్‌ ని, ఆయన టీమ్‌ని అభినందించారు. సినిమా చాలా బాగుందని తెలియజేశారు. అంతేకాదు ఈ సందర్భంగా చిరు తన మనసులోని మాటని బయటపెట్టాడు. తనకు ఫోక్‌లోర్‌ సినిమాలు చేయాలని ఉందన్నారు. మాయలు, మంత్రాలు ఉండే చిత్రాలంటే ఇష్టమని, అలాంటి సినిమాలు చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్‌కి తెలిపారు. నాగ్‌ ఇలాంటి కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు రెడీ అన్నట్టుగా తెలిపారు చిరు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

45

నాగ్‌ అశ్విన్‌ `కల్కి`తో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి రెండో పార్ట్ కూడా ఉంది. నెక్ట్స్ పార్ట్ 2పైనే ఫోకస్‌ పెట్టబోతున్నారు. ఆ తర్వాత అయినా చిరంజీవితో ప్రాజెక్ట్ ఉంటుందా? నాగ్‌ చిరు మాటలను సీరియస్‌గా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏ జరుగుతుందో గానీ, నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా `పాతాళభైరవి` లాంటి సినిమా అనే చర్చనే ఆసక్తికరంగా, క్రేజీగా అనిపిస్తుంది.  
 

55

ప్రస్తుతం చిరంజీవి సోషయో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వలో `విశ్వంభర` అనే సినిమాలో నటిస్తున్నారు. పురాణాలు, సోషల్‌ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్డెట్‌తో, భారీ కాస్టింగ్‌తోనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి భామలు మెరవబోతున్నారట. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories