నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలి అంటూ చిరంజీవి సినిమాపై కుట్ర.. ఆ మూవీ ఏంటి ? అసలేం జరిగింది ?

Published : Mar 21, 2026, 07:41 PM IST

చిరంజీవి నటించిన ఓ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. కానీ ఆ అవార్డుని వెనక్కి తీసుకోవాలని కొందరు కుట్ర చేశారు. అసలు ఆ కుట్ర ఎందుకు జరిగింది ? ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
చిరంజీవి సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మాస్ సినిమాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు, సందేశాత్మక సినిమాల్లో కూడా నటించారు. అలాంటి అద్భుతమైన సినిమాల్లో ఠాగూర్ ఒకటి. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2003లో విడుదలై సూపర్ హిట్ అయింది. అవినీతి నిర్మూలన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించింది.

25
చిరంజీవి ఠాగూర్ మూవీ

ఈ చిత్రం అనేక అవార్డులు కూడా కొల్లగొట్టింది. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ లో వచ్చే నేను సైతం ప్రపంచాగ్నికి అనే పాట గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ఈ పాటని సుద్దాల అశోక్ తేజ రచించారు. ఆయన సాహిత్యం ఎంతో అద్భుతంగా ఈ పాటకి కుదిరింది. శ్రీశ్రీ రచనలోని నేనుసైతం అనే లైన్స్ ని వాడుకున్నప్పటికీ శుద్దాల అశోక్ తేజ ఎంతో అద్భుతంగా పాటని రాశారు.

35
సుద్దాల అశోక్ తేజకి జాతీయ అవార్డు

ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం ఈ పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది. దీనితో సుద్దాల అశోక్ తేజకి ఈ పాటకి గాను జాతీయ అవార్డు దక్కింది. అయితే సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదు అని, అందుకు అతడు అర్హుడు కాదు అంటూ కొంతమంది కుట్ర చేశారు. అవార్డు వెనక్కి తీసుకోవాలి అని సౌత్ ఇండస్ట్రీ నుంచి కొందరు నేషనల్ అవార్డుల జ్యూరీకి లెటర్ పంపారు.

45
కుట్ర జరిగింది నిజమే

ఈ విషయాన్ని సుద్దాల అశోక్ తేజ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు. తనపై కుట్ర జరిగింది నిజమే అని అన్నారు. చిరంజీవి గారికి అప్పటికి వరకు నేను ఒక్క పాట కూడా రాయలేదు. 9 ఏళ్ళ తర్వాత నాకు అవకాశం వచ్చింది. చిరంజీవి గారు ఆ పాటలో శ్రీశ్రీ రాసిన నేను సైతం అనే లైన్ ఉండాలి అని అడిగారు. అందుకే నేను సైతం అనే లైన్ ఉపయోగించాను.

55
మరచిపోలేని అనుభూతి

దానిని అడ్డు పెట్టుకుని అది కాపీ పాట అని.. సుద్దాల అశోక్ తేజకి ఇచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలి అని కొందరు కుట్ర చేశారు. చిరంజీవి గారికి రాసిన తొలి పాటకే జాతీయ అవార్డు రావడంతో ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టినంత సంతోషం కలిగింది. అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మరో మరచిపోలేని అనుభూతి అంటూ సుద్దాల అశోక్ తేజ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories