Chiranjeevi: నిజమే.. చిరంజీవి, మోహన్‌లాల్‌ మల్టీస్టారర్‌ మూవీ, క్రేజీ డైరెక్టర్‌ అదిరిపోయే ప్లాన్‌

Published : Dec 24, 2025, 10:18 AM IST

చిరంజీవి అడపాదడపా మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో సినిమాకి రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించబోతుండటం విశేషం. 

PREV
15
చిరంజీవి, మోహన్‌ లాల్‌ మల్టీస్టారర్‌

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. పెద్ద హీరోల్లో అత్యంత బిజీ ఉన్న హీరో ఆయనే అని చెప్పాలి. ఇప్పుడు ఆయన మల్టీస్టారర్‌కి రెడీ అవుతున్నారు. `వాల్తేర్‌ వీరయ్య`లాగా మరో సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించబోతుండటం విశేషం. క్రేజీ దర్శకుడు ఈ కాంబోలో మూవీని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

25
సంక్రాంతికి `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీతో రాబోతున్న చిరంజీవి

చిరంజీవి ప్రస్తుతం `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర గెస్ట్ రోల్‌ని మించి ఉండబోతుందని సమాచారం. అంతేకాదు చిరంజీవి, వెంకీ మధ్య ఓ సాంగ్‌ కూడా ఉంటుందట. `ఆర్‌ఆర్‌ఆర్`లో ఎన్టీఆర్‌, చరణ్‌ల మధ్య ఉన్న `నాటు నాటు`ని తలపించేలా ఉంటుందని సమాచారం. ఇద్దరు సీనియర్లు ఒకే సినిమాలో కనిపించడమే అభిమానులకు కనువిందు అని చెబితే, ఒకే పాటలో డాన్సులు వేయడం మరో ట్రీట్‌గా చెప్పొచ్చు. ఇదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్‌గా మారుతుంది. ప్రమోషనల్‌గా హెల్ప్ అవుతుంది.

35
చిరంజీవి చేతిలో ఉన్న సినిమాల లైనప్‌

దీంతోపాటు చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటించారు. ఇది వీఎఫ్‌ఎక్స్ వల్ల ఆలస్యమవుతుంది. అదే సమయంలో బిజినెస్‌ కూడా కావడం లేదని సమాచారం. దీంతో ఈ సినిమాని పక్కన పెట్టారు. చిరంజీవి ఆ మధ్య స్పందిస్తూ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ ఉంటుందన్నారు. కానీ అప్పుడు కూడా డౌట్‌ అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ఆ తర్వాత శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి యాక్షన్‌ మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఇది వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబోలో రెండేళ్ల క్రితం `వాల్తేర్‌ వీరయ్య` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇది చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగానూ నిలిచింది. ఇందులో రవితేజ కీలక పాత్ర పోషించారు.

45
చిరంజీవి-బాబీ మూవీలో మోహన్‌ లాల్‌

బాబీ దర్శకత్వంలో ఇప్పుడు చిరంజీవి మరో సినిమా చేస్తున్నారు. ఇది సరికొత్త కథాంశంతో ఉండబోతుందట. అయితే ఇందులో చిరంజీవితోపాటు మరో హీరో పాత్రకి స్కోప్‌ ఉందట. అది బలమైన పాత్రకి ఎక్కువ, హీరో పాత్రకి తక్కువగా ఉంటుందని సమాచారం. ఆ పాత్ర కోసం మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ అడిగారట. ఇటీవల దర్శకుడు బాబీ.. మోహన్‌లాల్‌కి కథ చెప్పారు. ఆయన కూడా పాజిటివ్‌గా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కాంబో సెట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే నిజమైతే ఈ సినిమా తెలుగులో రూపొందుతున్న బిగ్గెస్ట్  ప్రాజెక్ట్ అవుతుందని, అదే సమయంలో క్రేజీ మూవీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది.

55
వృషభతో తెలుగు ఆడియెన్స్ ముందుకు మోహన్‌ లాల్‌

ఇదిలా ఉంటే మోహన్‌లాల్‌ అడపాదడపా తెలుగులో నటిస్తూనే ఉన్నారు. ఆ మధ్య ఎన్టీఆర్‌తో కలిసి `జనతా గ్యారేజ్‌` మూవీలో నటించారు. హీరోకి ఏమాత్రం తగ్గని పాత్ర అది. మోహన్‌లాల్‌ నటించి అదరగొట్టారు. ఇది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత `మనమంతా` అనే ఫ్యామిలీ చిత్రంలో నటించారు. ఇది పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు మోహన్‌ లాల్‌ నటించిన మలయాళ చిత్రాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయి. ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన `వృషభ` అనే చిత్రంలో నటించారు. ఇది ఈ గురువారం(డిసెంబర్‌ 25న) మలయాళంతోపాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories