చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రాల్లో `ఘరానా మొగుడు`మూవీ ప్రధానంగా చెప్పొచ్చు. ఇందులో చిరంజీవిలోని అసలైన మ్యానరిజం, స్టయిల్, యాక్షన్, డైలాగ్స్ కనిపిస్తాయి. పక్కా కమర్షియల్ మూవీ ఇది. పాటలు, డాన్సులు, మాస్ డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్, గ్లామర్, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కంప్లీట్ ప్యాకేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో నగ్మా హీరోయిన్‌గా నటించింది. వాణి విశ్వనాథ్ మరో ముఖ్య పాత్రలో మెరిసింది. రావు గోపాల రావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు.