సొంత తమ్ముడికి షాకిచ్చిన చిరంజీవి..దెబ్బకి జయసుధ ముఖం మాడిపోయింది

First Published | Jan 5, 2025, 8:15 PM IST

చిరంజీవి తనతో కలసి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సహజ నటి జయసుధకు షాకిచ్చారట. అది అలాంటి ఇలాంటి షాక్ కాదు.. చిరంజీవి చేసిన పనికి జయసుధ ముఖం మాడిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు లని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. చిరంజీవి అగ్ర హీరోలు ఇతర హీరోల చిత్రాల్లో చిన్న గెస్ట్ రోల్స్ చేయడం చాలా అరుదు. టాలీవుడ్ లో అలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఒకసారి చిరంజీవి తనతో కలసి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సహజ నటి జయసుధకు షాకిచ్చారట. 

అది అలాంటి ఇలాంటి షాక్ కాదు.. చిరంజీవి చేసిన పనికి జయసుధ ముఖం మాడిపోయింది. జయసుధ భర్త నితిన్ కపూర్ ఆ మధ్యన మరణించారు. అంతకు ముందు ఆయన కొన్ని చిత్రాలని నిర్మించారు. మెగా బ్రదర్ నాగబాబు నటించిన హ్యాండ్స్ అప్ చిత్రాన్ని నిర్మించింది జయసుధ, ఆమె భర్త నితిన్ కపూర్ కావడం విశేషం. 


హ్యాండ్స్ అప్ చిత్ర షూటింగ్ మొదలైన కొద్దిరోజులకు చిరంజీవి జయసుధకు ఫోన్ చేశారట. ఆ టైంలో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి సరదాగా.. ఏవమ్మా ప్రొడ్యూసరమ్మా మాకేమన్నా మీ సినిమాలో ఛాన్స్ ఇస్తావా అని అడిగారట. చిరంజీవి జోక్ చేయడంతో నవ్వుకున్నా. ఆ తర్వాత ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ అవసరం అయింది. ఆ పాత్రని చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాం. వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి అడిగా. ఇలా గెస్ట్ రోల్ ఉంది చేయాలి అని అడిగా. నేను అలా చిన్న పాత్రలో కనిపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని చిరు సందేహంతో అడిగారు. ఎలాగోలా ఒప్పించాం. 

సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రీవ్యూ ప్రదర్శించాం. చిరంజీవితో పాటు చాలా మంది సెలెబ్రిటీలు ప్రివ్యూ చూడడానికి హాజరయ్యారు. చిరంజీవి రెస్పాన్స్ తెలుసుకోవడానికి బయట మీడియా ఎదురుచూస్తోంది. చిరంజీవికి సినిమా ఏమాత్రం నచ్చలేదు. సినిమా నచ్చినా నచ్చకున్నా సెలెబ్రిటీలు మీడియా ముందు రెండు మూడు మంచి మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ చిరంజీవి నేను తర్వాత మాట్లాడతా అంటూ వెళ్లిపోయారు. దీనితో చిరంజీవికి సినిమా నచ్చలేదనే విషయం అందరికీ అర్థం అయింది. 

చిరంజీవి గారికి బయట నటించడం తెలియదు. కాబట్టి నచ్చని సినిమాని బావుందని చెప్పలేక వెళ్లిపోయారు. నా ముఖం అక్కడే మాడిపోయింది. ఇంటికి వెళ్ళాక చిరంజీవి ఫోన్ చేస్తే.. ఏంటి జయ సినిమా అలా ఉంది.. నువ్వేమో కామెడీ ఉంటుందని చెప్పావు.. నాకు ఏమాత్రం నచ్చలేదు అని చెప్పేశారట. కనీసం తన తమ్ముడు నటించాడు అని కూడా చూడలేదు.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు అని జయసుధ తెలిపారు. 

Latest Videos

click me!