బాస్ తొక్కేశాడు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో చిరంజీవిని ఉద్దేశించి ట్రోలింగ్ నడిచింది. చిరంజీవి వీటన్నింటినీ గమనిస్తూ ఉన్నట్లు ఉన్నారు. తన చేతికి మట్టంటకుండా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చాలా సినిమాలని సపోర్ట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరు కావడం, టీజర్ లేదా ట్రైలర్స్ రిలీజ్ చేయడం, చిత్ర యూనిట్ లని అభినందించడం చేస్తున్నారు. రీసెంట్ గా సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలి చిత్రం సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
25
బాస్ తొక్కేశాడు
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఇటీవల కొంత కాలంగా 'బాస్ తొక్కేశాడు' అనే మాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొందరు చిరంజీవి వ్యతిరేకులు ఈ ట్రెండ్ చేశారు.
35
చేతికి మట్టంటకుండా ట్రోలర్స్ కి కౌంటర్
ఇండస్ట్రీలో కొందరు హీరోలని, దర్శకులని ఎదగనివ్వకుండా చిరంజీవి తోక్కేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తూ ఈ ట్రెండ్ చేశారు. చిరంజీవిని ఉద్దేశిస్తూ కొన్ని మీమ్స్ కూడా వైరల్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ చిరంజీవి వరకు వెళ్లిందో ఏమో కానీ.. సిగ్మా ఈవెంట్ లో మెగాస్టార్ తన చేతికి మట్టంటకుండా ట్రోలర్స్ కి ఇచ్చిపడేశారు. ఈవెంట్ లో చిరంజీవి, ఫరియా అబ్దుల్లా మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. విశ్వంభరలో నా పక్కన డ్యాన్స్ చేయాల్సింది. మిస్ అయ్యావు. నువ్వే నో చెప్పావా ? నన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నావా ?
హైట్ ప్రాబ్లెమ్ కాదు. కావాలంటే నీ హైట్ కి మ్యాచ్ అయ్యే షూ వేసుకుంటా అని చిరంజీవి ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫరియా అబ్దుల్లా నేనెందుకు నో చెబుతాను సార్ అని బదులిచ్చింది. ఏమో నన్ను తొక్కేయాలని అనుకుంటున్నావేమో అని చిరంజీవి నవ్వుతూ అన్నారు. ఒక్కసారిగా అక్కడున్న అభిమానులు విజిల్స్ వేస్తూ కేరింతలు కొట్టారు. చిరంజీవి అన్న ఆ మాట ఫరియాని ఉద్దేశించి కాదు.. ట్రోలర్స్ కి కౌంటర్ అని అభిమానులకు అర్థం అయింది.
55
సోషల్ మీడియాలో వైరల్
దీనితో ఆ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా వ్యాపిస్తోంది. చేతికి మట్టంటకుండా చిరు భలే కౌంటర్ ఇచ్చారు అని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.