సినీ వర్కర్లకి ఫుడ్‌లో కోత పెట్టేందుకు నిర్మాతల సమావేశం.. చిరంజీవి చేసిన పనికి షాక్‌ అవ్వాల్సిందే..

Published : Jul 21, 2024, 03:53 PM IST

చిరంజీవి ఎంతో మందకి సహాయం చేశాడు. కానీ సినీ వర్కర్లపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి రియాక్షన్‌ అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.   

PREV
17
సినీ వర్కర్లకి ఫుడ్‌లో కోత పెట్టేందుకు నిర్మాతల సమావేశం.. చిరంజీవి చేసిన పనికి షాక్‌ అవ్వాల్సిందే..
super star chiranjeevi

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని చిరంజీవి స్వతహాగా సినిమాల్లోకి వచ్చి, చిన్న పాత్రలు చేసి, విలన్‌గా చేసి, హీరోగా ఎదిగాడు. స్టార్‌ హీరోగా, సుప్రీం హీరోగా, సూపర్‌ స్టార్‌ నుంచి, మెగాస్టార్ గా ఎదిగాడు. ఇప్పటికీ అదే ఇమేజ్‌, అదే రేంజ్‌ని చూపిస్తున్నాడు. నటన పరంగానే కాదు, ఆయన వ్యక్తిత్వం విషయంలోనూ మెగాస్టార్ అనిపించుకుంటున్నాడు. 

27

చిరంజీవి తాను సినిమాల్లో సంపాదించినదాన్ని ఎంతో కొంత ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఇండస్ట్రీ వాళ్లకే కాదు, సాధారణ ప్రజలకు కూడా ఆయన తనవంతు సేవ అందిస్తున్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతో చేస్తున్నారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తున్నారు. తన ఇమేజ్‌ని ఉపయోగించి సినీ వర్కర్లకి హెల్త్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు చిరు.
 

37
Chiranjeevi

అంతేకాదు ఒకప్పుడు ఆయన ఎంతో ఆర్థిక సహాయం కూడా చేశారట. చాలా మంది ఇప్పటికే చిరంజీవి సహాయం చేశారని పలు ఇంటర్వ్యూలు చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు. ముప్పై ఏళ్ల క్రితమే పది వేలు, ఇరవై, యాభై వేలు, లక్షల వరకు సహాయం అందించారట. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ విషయాలను తెలిపారు. అయితే ఒకప్పుడు చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన నటుడు ప్రసాద్‌ బాబు సైతం చిరంజీవి చేసిన సాయం గురించి, ఇండస్ట్రీకి చేసిన గొప్ప పని గురించి బయటపెట్టాడు. 

47

ప్రసాద్‌ బాబు చెన్నైలో ఇళ్లు కొన్నప్పుడు లక్ష రూపాయలు అవసరం అయ్యాయట. ఎలా అన్నప్పుడు కలలో చిరంజీవి వచ్చారట. దీంతో ఆ మరుసటి రోజు చిరంజీవి ఇంటికెళ్లి ఈ విషయం చెప్పడంతో మరో ఆలోచన లేకుండా లక్షరూపాయలు చేతిలో పెట్టారట. అప్పుడు చిరంజీవి గొప్పతనం, మంచి మనసు ఏంటో తెలిసిందట. మళ్లీ ఆ లక్ష తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఆయన వద్దు అన్నారట. `నువ్వు నాకు తిరిగి ఇవ్వాలని ఆ డబ్బు ఇవ్వలేదు. నీకు అవసరం అవుతాయి ఉంచుకో` అన్నాడట. కానీ తనకు నిద్ర పట్టడం లేదని, దీంతో వెంటనే ఆ అప్పు తీర్చినట్టు తెలిపారు ప్రసాద్‌ బాబు. 
 

57

ఈ సందర్భంగా చిరంజీవి ఇండస్ట్రీకి చేసిన పని గురించి బయటపెట్టాడు ప్రసాద్‌. ఆ సమయంలో నిర్మాతలంతా కలిసి సినీ వర్కర్లకి సంబంధించిన ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది. రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి, సినిమాకి పని చేసే వర్కర్లకి భోజనంలో ఇడ్లీ, వడలు వంటి కొన్ని ఐటెమ్స్ తగ్గించాలని నిర్మాతలంతా కలిసి నిర్ణయం తీసుకున్నారట. ఖర్చు తగ్గించడం కోసం సినిమాకి పనిచేసే వర్కర్ల భోజనంలో కోత పెట్టారు. 
 

67
Chiranjeevi

ఈ విషయం చిరంజీవికి తెలిసిందట. దీంతో నిర్మాతలపై ఫైర అయ్యాడట. అంతేకాదు వర్కర్ల భోజనానికి అయ్యే ఖర్చు తాను భరిస్తాను, పాపం వర్కర్ల పొట్టకొడతారా? భోజనం దగ్గర ఏంటి మీ కక్కుర్తి అంటూ నిర్మాతలపై ఫైర్‌ అయ్యాడట. హీరో ఎక్కువ టేకులు తీసుకుంటే ఏం చేస్తారు, అక్కడ ఖర్చు కాదా అంటూ మండిపడ్డాడట. తన సినిమాలకు తానే ఆ ఖర్చు భరిస్తానని చెప్పాడట. దీంతో భయపడిపోయిన నిర్మాతలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. ప్రసాద్‌ బాబు సుమన్‌ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. 
 

77

`మనవూరి పాండవులు` చిత్రం నుంచి చిరంజీవితో కలిసి నటించారు ప్రసాద్‌ రావు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు. చిరంజీవి సొంతమనిషిలా చూసుకున్నారని, ఇండస్ట్రీలో అంతా తనని అలానే భావిస్తారని చెప్పారు. `కృష్ణావతారం`, `బొబ్బిలి పులి`, `జేబుదొంగ`, `రుద్రవీణ`, `త్రినేత్రుడు`, `ఖైదీ నెం 786`, `యముడికి మొగుడు`, `ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌`, `కొండవీటి దొంగ`, `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `కొదమసింహం`, `గ్యాంగ్ లీడర్‌`, `మెకానిక్‌అల్లుడు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.చివరగా `దమ్ము` చిత్రంలో మెరిశారు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ప్రసాద్‌ బాబు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories