సినిమా షూటింగ్ కోసం చిరంజీవి మురికి నీళ్లతో సర్దుకుపోయారు అని ఓ దర్శకుడు తెలిపారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది అని, కెమెరా ముందుకు వెళితే చిరంజీవి ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు అంటూ ప్రశంసలు కురిపించారు.
చిరంజీవికి మెగాస్టార్ అనే స్టేటస్ అంత సులభంగా దక్కలేదు. దీని వెనుక చిరంజీవి పడ్డ కష్టం, ప్రతిభ, నటన పట్ల అంకితభావం ఉన్నాయి. 1983లో ఖైదీ తర్వాత చిరంజీవికి తిరుగులేని స్టార్ డమ్ వచ్చేసింది. చిరంజీవి ఏం చెప్పినా చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ చిరంజీవి ఎప్పుడూ తన క్రేజ్ ని దుర్వినియోగం చేయలేదు. సినిమా కోసం, నిర్మాతల బాగు కోసం చిరంజీవి తన ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడ్డారు.
25
శివ నాగేశ్వర రావు కామెంట్స్
1985లో విడుదలైన జ్వాల మూవీ షూటింగ్ లో జరిగిన సంఘటనలని దర్శకుడు శివనాగేశ్వర రావు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. చిరంజీవితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. జ్వాల చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఎండలు మండిపోతున్న ఏప్రిల్ నెలలో జ్వాల మూవీ లోని ఒక ఫైట్ సీజ్ షూటింగ్ జరుగుతోంది. చెన్నైలో షూటింగ్. చెన్నైలో వేడి, ఉక్కపోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
35
బండరాళ్లు కాలుతున్నా పట్టించుకోని చిరు
చిరంజీవి, టైగర్ ప్రభాకర్ మధ్య ఫైట్ సీన్ అది. అది కూడా బండరాళ్ల మధ్య ఫైట్. ఎండకు బండరాళ్లు కాలిపోయేలా వేడెక్కి ఉన్నాయి. వాటిపై పడుతూ చిరంజీవి ఫైట్ చేశారు. షూటింగ్ అయ్యాక షర్ట్ విప్పి చూస్తూ శరీరం ఎర్రగా కమిలిపోయి ఉంది. షూటింగ్ జరుగుతున్నంత సేపు చిరంజీవి తనకు బండరాళ్లు కాలుతున్నాయి అని చిన్న మాట కూడా చెప్పలేదు. కెమెరా ముందుకు వెళ్లారు అంటే ఆయనకు ఇక ఏ కష్టాలు గుర్తుకు రావు.
అదే సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా వర్షంలో తడుస్తూ ఫోన్ మాట్లాడే సీన్ ఒకటి చేయాలి. అది కంప్లీట్ అయితే షూటింగ్ పూర్తయినట్లే. సరిగ్గా అదే సమయంలో ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు. చిరంజీవి కావాలి అనుకుంటే మరో రోజుకు షూటింగ్ పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ నిర్మాతకు ఇబ్బంది ఉండకూడదు అని భావించారు. పక్కనే ఒక పాడుబడ్డ కొలను ఉంది. నీళ్లు పాచి పట్టి, బాగా మురికిగా ఉన్నాయి. కనీసం అందులో దిగడానికి కూడా ఎవరూ సాహసించరు. అలాంటిది ఆ నీళ్లతో షూటింగ్ పూర్తి చేయడానికి చిరంజీవి రెడీ అయ్యారు.
55
బకెట్లతో మురికి నీళ్లు తెప్పించుకుని..
3 బకెట్లతో ఆ కొలనులోని నీళ్లు తెప్పించారు. ఆ నీళ్లు బ్యాడ్ స్మెల్ వస్తున్నా వెనకడుగు వేయలేదు. ప్రొడక్షన్ బాయ్స్ పై నుంచి వర్షం లాగా ఆ నీళ్ళని పోస్తుంటే చిరంజీవి తడుస్తూ షూటింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి మరో సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. ఇంకెవరైనా అయి ఉంటే మినరల్ వాటర్ కావాలి అని అడిగేవాళ్ళు అంటూ శివనాగేశ్వర రావు తెలిపారు. జ్వాల చిత్రంలో భానుప్రియ, అల్లు రామలింగయ్య, సిల్క్ స్మిత, రాధిక కీలక పాత్రల్లో నటించారు.