Upasana-Ram Charan: చిరంజీవికి ఉపాసన క్లోజ్ ఫ్రెండ్ అయ్యారట. నాన్నతో మాట్లాడాలంటే తాము భయపడతామని, కానీ తను మాత్రం ఫ్రీగా వెళ్తుందని చెప్పాడు. అయితే ఇది చాలా డేంజర్ అంటూ కామెంట్.
మెగా కోడలు ఉపాసన.. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. ఆమె ఓ వైపు తల్లిగా, మరోవైపు భార్య, ఇంకోవైపు మెగా కోడలిగా, ఇవన్నీ కాకుండా అపోలో ఆసుపత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ ఆమె బ్యాలెన్స్ చేస్తూ ఉత్తమ కోడలు అనిపించుకుంటున్నారు. అంతేకాదు అత్తమ్మ సురేఖతో కలిసి `అత్తమ్మ కిచెన్` పేరుతో మంచి రెడీమేడ్ ఫుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. ఇలా తనలోని మల్టీ టాలెంట్‌ని ఆవిష్కరిస్తూ రాణిస్తున్నారు.
25
రామ్ చరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన
ఉపాసన నేడు తన 40వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు రామ్ చరణ్. ఉపాసన, చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిది ఏడేళ్ల ప్రేమ. అంటే కామన్ ఫ్రెండ్‌గా ప్రారంభమై అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రపోజ్ చేసుకున్నారు. దీనికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. చరణ్, ఉపాసన పెళ్లై 15ఏళ్లు అవుతుంది. ఇటీవల వాళ్లు మొదట కూతురు క్లీంకారకి జన్మనివ్వగా, ఆ తర్వాత కవలలకు జన్మనిచ్చారు. కొడుకు, కూతురు జన్మించారు.
35
చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ ఉపాసన
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ది సినిమా ఫ్యామిలీ, ఉపాసన వాళ్లు మెడికల్ రంగంలో ఉన్నారు. ఈ రెండు కుటుంబాలకు ఎలా సెట్ అయ్యిందనేది ప్రశ్న. కానీ చిరంజీవి ఫ్యామిలీ తనని చాలా ప్రేమగా చూసుకుంటారని, మరో కూతురుగా భావిస్తారని తెలిపింది ఉపాసన. అదే సమయంలో ఉపాసన గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు చరణ్. చిరంజీవితో మాట్లాడాలంటే తామే భయంగా, ఇబ్బందిగా ఫీలవుతుంటామని, కానీ ఉపాసన మాత్రం ఈజీగా ఆయనతో కలిసిపోతుందని, డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడుతుందని, మామయ్య ఎలా ఉన్నారని అడిగేస్తుందని, ఆయనతోపాటు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారని తెలిపారు చరణ్.
`నాన్నగారితో మా కంటే ఉపాసనే క్లోజ్ అయ్యారు, ఓ రకం ఓ రకంగా నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఏదున్నా, ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఇది చాలా డేంజర్ ఎందుకంటే. నాన్నగారి నుంచి సపోర్ట్ మొత్తం ఆమెకే వెళ్తుంటుంది` అని తెలిపారు చరణ్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఉపాసనది ఈజీగా కలిసిపోయే మనస్తత్వం అని తెలిపారు చరణ్. ఇంట్లో చిరంజీవికే కాదు, అందరికి తనే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు.
55
సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్న చరణ్
రామ్ చరణ్ ఇటీవలే `పెద్ది` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ సుమారు నాలుగు వందల కోట్లు వసూలు చేసింది. చరణ్‌కి పెద్ద హిట్ ఇచ్చింది. దీనికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రస్తుతం చరణ్.. సుకుమార్‌తో సినిమాకి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట.