రోజా.. దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ప్రేమ విషయం తెలిసి చిరంజీవి బోల్డ్ కామెంట్ చేశాడట. తెలుగోళ్లు దొరకలేదా, ఆ అరవోన్ని ప్రేమించావంటూ చురకలంటించారట.
నటి, మాజీ మంత్రి రోజా ఇప్పుడు మళ్లీ యాక్టింగ్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆమె ఇప్పటికే జీ తెలుగులో షోస్ చేస్తోంది. మరోవైపు సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తికరంగానే ఉన్నట్టు వెల్లడించింది. చిరంజీవి, బాలయ్య వంటి వారితో కలిసి నటించాలని ఉందని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తన ప్రేమకి సంబంధించి చిరంజీవి చేసిన కామెంట్‌ని వెల్లడించింది. అంతేకాదు చిరంజీవికి ఆయన భార్య సురేఖ గట్టి కౌంటర్ కూడా ఇచ్చిందట.
24
మొదటి సినిమాతోనే సెల్వమణితో ప్రేమలో పడ్డ రోజా
రోజా చదువుకునే సమయంలోనే సినిమాలోకి వచ్చింది. ఆమె యాక్సిడెంటల్‌గానే హీరోయిన్ అయ్యింది. అయితే `చెమ్మరుతి` అనే చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సెల్వమణి దర్శకుడు. షూటింగ్ ప్రారంభంలోనే సెల్వమణి, రోజా ప్రేమలో పడ్డారట. ఆయన చూపించిన కేరింగ్, ప్రేమ, అప్యాయతకి రోజా ఫిదా అయ్యింది. దీంతో ప్రేమలో పడింది. అయితే ఆ తర్వాత ఈ విషయం చిరంజీవికి తెలిసిందట. దీంతో అప్పట్లో రోజా ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందట. రోజా కలిసినప్పుడు ఆమెకి పెద్ద షాక్ ఇచ్చారు చిరంజీవి. ఈ విషయాన్ని రోజానే వెల్లడించింది.
చిరంజీవి కలిసినప్పుడు ఏమ్మా.. ప్రేమించడానికి నీకు తెలుగోళ్లు ఎవరూ దొరకలేదా? పోయి పోయి ఆ అరవోన్ని ప్రేమించావని తిట్టాడట. చిరంజీవి సరదాగా తనని ఆటపట్టిస్తుంటాడని, ఆ సమయంలోనూ తన ప్రేమ విషయంలో చిరంజీవి బోల్డ్ గా కామెంట్ చేసినట్టు తెలిపింది రోజా. అయితే వెంటనే ఆయన భార్య సురేఖ కల్పించుకున్నారట. `మీకేంటి ప్రాబ్లం, ఆ పిల్లకి నచ్చారు, ఆయనకు ఆమె నచ్చారు. చిన్న పిల్లలకు అలా చెప్పకూడదు, వారి మైండ్ డైవర్ట్ అవుతుంది` అని సురేఖ.. చిరంజీవికి ఇచ్చిపడేసిందట. తాజాగా రోజా చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రోజా ఫస్ట్ సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ సినిమా పోయింది. తర్వాత తన ఫ్యామిలీని సెట్ చేయాలనుకున్నారు. తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేయాలనుకుంది. అది షూటింగ్ డిలే అయ్యింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఆ నష్టాలను పూడ్చడం కోసం సినిమాలు చేయాల్సి వచ్చింది. ఇలా అనేక కారణాలతో వీరి లవ్ ట్రాక్ పదకొండేళ్లపాటు కొనసాగింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి కూతురు, కొడుకు జన్మించారు. రోజా.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించారు. పిల్లల కోసం కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేశారు. క్యారెక్టర్స్ తో మెప్పించారు. అలాగే రాజకీయాల్లోకి వెళ్లారు. మొదట టీడీపీలో చేరారు. కానీ అందులో రెండు సార్లు ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యింది. వైసీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యింది. రెండోసారి కూడా గెలిచి మంత్రి అయ్యింది. గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది రోజా. దీంతో మళ్లీ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టింది.