చిరు, బాలయ్య, మహేష్, ఎన్టీఆర్, బన్నీ టాలీవుడ్ స్టార్స్ బిరుదు మారాయి... వాటి నేపథ్యం ఇదే!

First Published May 18, 2021, 3:23 PM IST

స్టార్ హీరో అనే హోదా ఒకరు ఇచ్చేది కాదు. కష్టపడి సంపాదించుకునేది. ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో వారి నుండి పొందే గౌరవమే స్టార్డం, స్టార్ అనే బిరుదు. వందల హీరోలు ఉన్నా చుక్కల్లో చంద్రుడు వలె స్టార్స్ కొందరే ఉంటారు. ఏళ్ల తరబడి శ్రమ, నటన, నాట్యం, మాట ఓ నటుడ్ని స్టార్ ని చేస్తాయి. ఒక స్టార్ హీరో హోదా, బిరుదు అతని కెరీర్ గ్రాఫ్ ని బట్టి మారుతూ పోతాయి. చిరు, బాలకృష్ణ, నాగ్ వంటి సీనియర్ స్టార్స్ తో పాటు నేటితరం స్టార్స్ కూడా పాత బిరుదు నుండి కొత్త బిరుదులు తెచ్చుకున్నారు. టాలీవుడ్ స్టార్స్ పాత బిరుదులు కొత్త బిరుదులు ఏమిటో, వాటి నేపథ్యం ఏమిటో చూద్దాం.. 
 

టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మూడు దశాబ్దాలుగా ఆయన వెండితెరను ఏలుతున్నారు. ఈ ఎవర్ గ్రీన్ స్టార్ ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో బిరుదు పొందారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిన చిరు 90ల నాటికి మెగాస్టార్ హోదాకు చేరుకున్నారు.
undefined
ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ స్టార్  హీరోలలో ఒకరిగా ఎదిగారు. నందమూరి అందగాడుగా అనేక హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. బాలయ్యకు మొదట ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదు యువరత్న. అయితే సింహ మూవీ తరువాత నుండి ఆయన తన బిరుదు నటసింహంగా మార్చుకున్నారు.
undefined
సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున కెరీర్ బిగినింగ్  లో పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. ఐతే ఆయన హిట్ ట్రాక్ ఎక్కాక ఫ్యాన్స్ యువసామ్రాట్ అనే బిరుదు ఇచ్చారు. ఓ ఏజ్ దాటాక కూడా యువ సామ్రాట్ అంటే బాగోదని ఫీలైన నాగార్జున కింగ్ గా తన బిరుదు మార్చుకున్నారు. ప్రస్తుతం టైటిల్స్ లో నాగార్జున పేరు ముందు కింగ్ ఉంటుంది.
undefined
నేటితరం స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరుగాంచాడు. అందానికి చిరునామాగా చెప్పుకునే మహేష్ ని కెరీర్ బిగినింగ్ లో ప్రిన్స్ అని పిలిచేవారు. హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ తో టాప్ రేంజ్ కి చేరుకున్న మహేష్ తన తండ్రిగారి బిరుదైన సూపర్ స్టార్ ని తన బిరుదుగా మార్చుకున్నారు.
undefined
లెజెండ్ ఎన్టీఆర్ పేరుతో పరిశ్రమకు పరిచమైన  మనవడు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద బాధ్యతనే భుజాలకు ఎత్తుకున్నాడు. ఐతే ఆనతి కాలంలో స్టార్ హోదా సొంతం చేసుకుని తాత పేరు నిలబెట్టాడు. ఇక ఎన్టీఆర్ స్టార్ డమ్ అందుకున్నాక ఆయనకు యంగ్ టైగర్ అనే బిరుదు సంక్రమించింది. తరువాత ఆయన దానిని ఏ వన్ స్టార్ గా మార్చుకున్నాడు. అది కలిసి రాకపోవడంతో యంగ్ టైగర్ నే కొనసాగిస్తున్నారు.
undefined
మెగా హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ సైతం తన బిరుదు మార్చుకున్నారు. డాన్స్ లలో స్టైల్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే బిరుదు దక్కింది. పుష్ప మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న బన్నీకి దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు.
undefined
click me!