చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ ఎప్పుడు ? ఎవరు చేయబోతున్నారో తెలుసా?

Published : Aug 22, 2025, 06:40 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఈ కాంబినేషన్ పై మరోసారి టాలీవుడ్ లో చర్చ స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమా చేయబోయే దర్శకుడు ఎవరు? 

PREV
15

చిరంజీవి,బాలకృష్ణ కాంబోలో మల్టీస్టారర్

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిరంజీవి , బాలకృష్ణ కాంబో మూవీపై మళ్లీ చర్చ మొదలయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఖాయం. అయితే ఈ ఇద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ కథ రాయడం, వారితో కలిసి షూటింగ్ చేయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ దోరకడం కూడా కష్టమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ఆర్ వచ్చి ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక బాలయ్య, చిరంజీవి కాంబోలో కూడా సినిమా వస్తే చూడాలని ప్యాన్స్ అనుకుంటునర్నారు. అయితే ఈసినిమా చేయగలిగే దర్శకుడు ఎవరు అనేది పెద్ద ప్రశ్న. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక డైరెక్టర్ పేరు ఈ సినిమా కోసం ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు అనిల్ రావిపూడి.

DID YOU KNOW ?
చిరంజీవి అర్జునుడుగా
మెగాస్టార్ చిరంజీవితో భారీ పౌరాణిక సినిమా చేయాలని అనుకున్నారు స్టార్ ప్రొడ్యూసర్ సుబ్బిరామిరెడ్డి. వీర అర్జున టైటిల్ కూడా అనుకున్నారు. కాని అది సెట్స్ మీదకు వెళ్లలేదు.
25

రాజమౌళి తో సమానంగా

రాజమౌళి తరువాత ఫెయిల్యూర్ అంటూ ఎరుగని దర్శకుడిగా ఉన్నాడు అనిల్. ఈ దర్శకుడు అయితే ఈ ఇద్దరు స్టార్లను కలిపి అద్భుతమైన సినిమా చేయగలడు అని ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ మొదలయ్యింది. దానికి తగ్గట్టు అనిల్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మూడు సార్లు అనిల్ కూడా ఈ ప్రాజెక్ట్ ప్రస్తావన తీసుకువచ్చాడు. తాజాగా కూడా అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చిరంజీవితో చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ టైటిల్ గ్లింప్స్ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్యతో సినిమా చేయడానికి తాను ఎపన్పుడు రెడీగా ఉన్నట్టు వెల్లడించారు.

35

కథ దొరికితే నేను రెడీ

ఈ సందర్భంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "నాకు సరైన కథ దొరికినట్లయితే చిరంజీవిగారిని, బాలకృష్ణగారిని ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తాను, దాని కోసం నేను రెడీగా ఉన్నాను '' అని తెలిపారు. చిరంజీవితో ప్రస్తుతం చేస్తున్న సినిమా విశేషాలను వెల్లడించిన ఆయన, బాలకృష్ణతో కలిసి నటించేందుకు చిరంజీవి ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అనిల్ రావిపూడి గుర్తు చేశారు.

45

అభిమానుల ఎదురుచూపులు

"చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరి మ్యానరిజమ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. వారిద్దరినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసే కథ సిద్ధమైతే తప్పకుండా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాను," అని అనిల్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో మెగా నందమూరి అభిమానుల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. మళ్లీ ఇండస్ట్రీలో మెగా నందమూరి మల్టీ స్టారర్ పై చర్చ మొదలయ్యింది. ఈ సినిమాను అనిల్ పక్కాగా తెరకెక్కిస్తారన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

55

చిరంజీవి పాత్ర చాలా ప్రత్యేకం

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుండి స్ఫూర్తిగా ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. ఈ సినిమాలో చిరంజీవి పాత చాలా భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు. అంతే కాదు మూవీలో కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు కూడా ఉంటాయని అనిల్ చెప్పారు. “చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో”, “బాక్స్‌ బద్దలైపోద్ది” వంటి మెగా మేనరిజం డైలాగ్స్ ను ఈసినిమాలో ఉపయోగించారు. ఈ డైలాగ్స్ అభిమానులకు పండుగ చేయబోతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories