మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ పోటీ జరిగింది. నాగార్జున తన తొలి చిత్రంతోనే చిరంజీవికి షాకిచ్చారు. వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ 2006 వరకు కొనసాగింది.
టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున దాదాపు 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. నాగార్జున, చిరంజీవి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ సినిమాల విషయంలో మాత్రం పోటీ ఉంటుంది. వీరిద్దరి పోటీ స్టాలిన్ -బాస్ వరకు కొనసాగింది. నాగార్జున తన తొలి చిత్రం విక్రమ్ తోనే చిరంజీవితో పోటీ మొదలు పెట్టారు. వేట- విక్రమ్ నుంచి స్టాలిన్ - బాస్ వరకు చిరంజీవి నాగార్జున ఏ చిత్రాలతో పోటీ పడ్డారో ఇప్పుడు చూద్దాం.
26
తొలి చిత్రంతోనే చిరంజీవికి షాకిచ్చిన నాగార్జున
నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం విక్రమ్. ఈ మూవీ 1986 మే 23 న రిలీజ్ అయింది. మే 28న చిరంజీవి వేట చిత్రం రిలీజ్ అయింది. విక్రమ్ మూవీ హిట్ కాగా చిరంజీవి వేట నిరాశ పరిచింది. తొలి చిత్రంతోనే నాగార్జున చిరంజీవికి షాక్ ఇచ్చారు. అదే ఏడాది ఆగష్టు 22న చిరంజీవి చంటబ్బాయి రిలీజ్ కాగా ఆగష్టు 29న నాగార్జున కెప్టెన్ నాగార్జున చిత్రం రిలీజ్ అయింది. చంటబ్బాయి మంచి విజయం సాధించింది. కెప్టెన్ నాగార్జున ఫ్లాప్.
36
1987లో నాగార్జునకి నిరాశ
1987 జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా నాగార్జున అరణ్య కంద చిత్రం రిలీజ్ అయింది. జనవరి 9న చిరంజీవి దొంగమొగుడు రిలీజ్ అయింది. అరణ్య కాండ చిత్రం డిజాస్టర్ కాగా దొంగమొగుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే ఏడాది మార్చిలో చిరంజీవి, నాగార్జున ఇద్దరికీ నిరాశ తప్పలేదు. మార్చిలో విడుదలైన చిరంజీవి ఆరాధన, నాగార్జున సంకీర్తన రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
1988 మార్చి 4న విడుదలైన చిరంజీవి రుద్రవీణ చిత్రం విమర్శకుల ప్రశంసలు, అవార్డులు పొందింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మార్చి 12న వచ్చిన నాగార్జున ఆఖరి పోరాటం చిత్రం సూపర్ హిట్ అయింది. అదే ఏడాది జూన్ లో మరోసారి చిరు నాగార్జున పోటీ పడ్డారు. ఆ నెలలో విడుదలైన ఖైదీ నెంబర్ 786 సూపర్ హిట్ కాగా నాగార్జున మురళీ కృష్ణుడు చిత్రం యావరేజ్ గా నిలిచింది.
56
శివ తర్వాత నాగార్జునకి బిగ్ షాక్
1989లో సంక్రాంతికి చిరంజీవి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, నాగార్జున విజయ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్ కాగా.. విజయ్ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత 1990లో ఆసక్తికర పోటీ జరిగింది. అంతకు ముందే శివ లాంటి ఇండస్ట్రీ హిట్ తో నాగార్జున పేరు టాలీవుడ్ లో మారుమోగుతోంది. శివ తర్వాత అమల, నాగార్జున వెంటనే నటించిన చిత్రం ప్రేమ యుద్ధం. ఈ మూవీ 1990 మార్చి 23 న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రెండు వారాల ముందు విడుదలైన చిరంజీవి కొండవీటి దొంగ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రేమ యుద్ధం మాత్రం డిజాస్టర్.
66
చివరగా పోటీ పడింది అప్పుడే
ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున ముగ్గురు మొనగాళ్లు, గోవిందా గోవిందా చిత్రాలతో పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇక చివరగా చిరు, నాగ్ మధ్య పోటీ జరిగింది 2006లో. ఆ ఏడాది చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రం యావరేజ్ గా నిలిచింది. నాగార్జున బాస్ మూవీ ఫ్లాప్ అయింది. మొత్తంగా చిరు, నాగార్జున మధ్య బాక్సాఫీస్ వార్ ఏకపక్షంగా అయితే జరగలేదు. నాగార్జున చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు.